2014లో జనసేన పేరుతో సొంత పార్టీని నెలకొల్పిన సినిమా నటుడు పవన్ కళ్యాణ్, వాస్తవానికి అంతకముందు తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి నెలకొల్పిన ప్రజారాజ్యం పార్టీలో యువ రాజ్యం విభాగానికి కొన్నాళ్లపాటు అధ్యక్షుడిగా వ్యవహరించారు. అయితే ఆ తరువాత ప్రజారాజ్యం పార్టీని మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడంతో పవన్ కొన్నాళ్లపాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇక 2014లో పార్టీని నెలకొల్పిన తరువాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రత్యక్షంగా బరిలో దిగకుండా టీడీపికి మద్దతిచ్చిన పవన్, వారి గెలుపు తరువాత ఆ పార్టీ అధినేత చంద్రబాబు సహా మిగతా ఎమ్యెల్యేలు మంత్రులను ఎక్కడికక్కడ వెనకేసుకొచ్చారు. ఆ విధంగా మలి దశ ఎన్నికల వరకు వారిని వెనకేసుకొచ్చిన పవన్, సరిగ్గా ఎన్నికల సమయం సమీపించడంతో హఠాత్తుగా ఆ పార్టీ నాయకులపై విరుచుకుపడడం మొదలెట్టారు. 

అప్పట్లో పవన్ విచిత్ర వైఖరిపై పలు వార్తలు కూడా హల్ చల్ చేసాయి. అంతేకాక ఆయన టిడిపి నుండి ప్యాకెజీ తీసుకుని వారికి వత్తాసు పలుకుతున్నారంటూ కూడా పలువురు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా పవన్ పై ఫైరయ్యారు. అయితే అర్ధాంతరంగా పవన్ టిడిపిపై విరుచుకుపడడంతో ఏమి అర్ధం కానీ ప్రజలు, ఈసారి ఏకంగా ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన ఆయన జనసేన పార్టీకి కేవలం ఒకే ఒక్క సీటు మాత్రమే కట్టబెట్టారు. పవన్ తాను పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో కూడా ఘోరంగా ఓడిపోవడం జరిగింది. ఇక అదే సమయంలో రాష్ట్రంలో వైసిపి గెలవడం జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిష్టించడం జరిగాయి. ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం ఏమిటంటే, నాకు అన్ని కులాలు సమానమే అని చెప్పే పవన్ కళ్యాణ్ గారు, మొన్నటి ఎన్నికల పర్యటనల్లో ఎక్కువగా తన ప్రచారాన్ని, తమ సామజిక వర్గ ప్రజలు అధికంగా ఉండే తూర్పు, పశ్చిమ, విశాఖ, శ్రీకాకుళం వంటి జిల్లాల్లోనే ఎందుకు నిర్వైహించినట్టు అని ఆయనపై కొన్ని మీడియా మాధ్యమాల్లో అప్పట్లో ప్రశ్నల వర్షం కూడా కురిసింది.  

ఇక మొన్నటి ఎన్నికల్లో గెలిచి పరిపాలన చేపట్టిన జగన్ గారు, గడిచిన ఐదు నెలల్లో పలు ప్రజాహిత, మరియు ప్రజలకు మేలు చేకూర్చే పధకాలు ప్రవేశపెడుతూ ముందుకు సాగుతుంటే, కుటిల బుద్దితో అది సహించలేని ప్రతిపక్ష టిడిపి వారితో కలిసి వైసిపి పై, అలానే సీఎం జగన్ మోహన్ రెడ్డి గారిపై పవన్ కళ్యాణ్ గారు లేనిపోని నిందలేస్తున్నారని కొందరు ప్రజలు బహిరంగంగానే చెప్పుకోవడం విశేషం. గత ఎన్నికల్లో టిడిపి నుండి ప్యాకెజీ తీసుకుని మరీ ఆ పార్టీని వెనకేసుకొచ్చిన పవన్ కళ్యాణ్ గారు, ఈ ఎన్నికల్లో జగన్ గారి పై బురద చల్లడానికి ఎంత తీసుకున్నారో చెప్పాలంటూ పలువురు నెటిజన్లు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఆయన్ను ప్రశ్నిస్తున్నారు.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: