యాభయ్యేళ్ళకు పైగా కాపాడుకొచ్చిన ప్రాతివత్యం ఒక్కసారిగా పోయింది. పెద్ద పులి బాల్ ధాకరే పరువు బజార్న పడిపోయింది. విదేశీ వనిత సోనియా అని తన సామ్నా పత్రికలో పెద్దపులి గర్జిస్తే మద్దతు కోసమని ఉద్ధవ్ ధాకరే అదే సోనియా గుమ్మం వద్ద నిలబడడం ద్వారా మొత్తం పరువు తీశారన్న బాధ శివసైనికుల్లోనే కనిపిస్తోంది.


శివసేన బీజేపీతో ముప్పయ్యేళ్ళ బంధాన్ని కేవలం సీఎం సీటు కోసం త్యాగం చేసేసింది. కాంగ్రెస్ తో ఎన్సీపీతో కొత్త మైత్రి నెరిపింది. పోనీ అలాగైనా అన్నీ కుదిరి సీఎం గద్దెనెక్కిందా అంటే అదీ లేదు. మొత్తానికి రాష్ట్రపతి పాలన వచ్చేసింది. శివసేన ఆశలు అడియాశలు అయ్యాయి. సహజ మిత్రునిగా ఉన్న బీజేపీతోనే సర్దుకుపోయి ఉంటే ఈపాటికి డిప్యూటీ సీఎం తో పాటు పలు మంత్రి పదవులు దక్కేవి. కేంద్రంలో మంత్రి పదవి కూడా ఉండేది.


ఇపుడు అన్నీ పాయే అన్నట్లుగా పరిస్థితి తయారైంది. నిజానికి జనం మహారాష్ట్రలో బీజేపీ శివసేనల కూటమిని అనుకూలంగా ఓటు చేశారు. దాన్ని గౌరవించి కూటమిలో కొనసాగాల్సిన శివసేన అనైతిక పొత్తులకు తెరలేపింది. బీజేపీతో పెటాకుల దాకా కధ నడుపుకుని వచ్చింది. చివరికి విసిగిన కమలదళం నేతలు  ప్రభుత్వం ఏర్పాటు చేయామని  దూరంగా ఉండిపోయారు. 


మరో వైపు సోనియా గాంధీ మద్దతు ఇచ్చే విషయంలో ఊరించి  మరీ షాక్ తినిపించారన్న కామెంట్స్ వస్తున్నాయి. ఆశపడినంత సేపు లేదు అంతా ఆవిరి అయిందన్న బాధతో శివసేన ఉంది. ఇపుడు ఏ ముఖం పెట్టుకుని బీజేపీ వైపు వెళ్ళగలదు, పోనీ కలసి  ఉందామంటే ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమిలోకి రానిచ్చే చాన్సే లేదు. ఎందుకంటే వారికి ముస్లిం ఓట్లు కావాలి. ఈ పరిణామాలతో మహారాష్ట్ర పొలిటికల్ సీన్లో శివసేన ఒంటరిగా మిగిలిపోయింది. అయినా మొండికేస్తే ఫలితాలు ఇలాగే ఉంటాయని ఈ ఎపిసోడ్ నిరూపించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: