అవును ప్రమాధ ఘంటికలే మోగుతున్నాయి. అలా ఇలా కాదు  చెవులు బద్దలయ్యేలా మోత మోగిస్తున్నాయి. వినమని గట్టిగానే చెబుతున్నాయి. వింటే బాగుపడేవ్. లేకుంటే చెడేవంటూ ఘోషిస్తున్నాయి. అయినా మారడం జరుగుతుందా. విచ్చలవిడితనానికి అలవాటు పడిన వారు మారుతారా. మారకపోతే మారణ హోమమేనని చెబుతున్నా వినకపోతే ఆ తరువాత...?


ఆ తరువాత నందనవనం లాంటి నగరాలు నరకప్రాయం అవుతాయని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. వాయుకాలుష్యం తరుముకుని వచ్చేస్తోంది. దాని ప్రభావంతో మానవ మనుగుడకే పెను సవాల్ అంటోంది. ఢిల్లీ ఇపుడు మొదటి బాధితురాలు అయితే దేశంలో ముంబై, చెన్నై వంటి నగరాలు అదే వరసలో  డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాలో తీసుకుంటే హైదరాబాద్ తో పాటు, విశాఖపట్నం, విజయవాడలకు వాయుకాలుష్యం ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. ఇక్కడ పరిమితికి మించి కాలుష్యం పొగలు కక్కుతోందని లెక్కలు వేసి మరీ చెబుతున్నారు. విశాఖ విషయానికే వస్తే పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. అవి వెదజల్లే కాలుష్యం గాలిలో తెట్టగా ఏర్పడి వాతావరణాన్ని మొత్తం పాడుచేస్తోంది. మరో వైపు వేగవంతమైన జీవనంలో వాహనాల సంఖ్య ఏ ఏటికి ఆ ఏడు పెరిగి మ్రుత్యు ఘంటికలే మోగిస్తున్నాయని అంటున్నారు.


దీంతో శ్వాస పీల్చుకోవడమే కష్టంగా మారుతోంది. పచ్చని చెట్లు కనిపించడంలేదు. కాలగతులు ఆగిపోతున్నాయి. చలిగాలిలో పగటి ఉష్ణోగ్రతలు దారుణంగా పెరిగిపోతున్నాయి. వానలు ఆగి చలి మొదలవ్వాల్సిన చోట వేసవి తాపం విశాఖను ఆవరించేస్తోంది.  తెల్లవారుజామున దట్టమైన పొగమంచులా కాలుష్యం కమ్ముకుని చీకటిని స్రుష్టిస్తోంది. ఇదంతా పర్యావరణాన్ని విచ్చిన్నం చేసిన పుణ్యం అంటున్నారు. ఇక ఇదే రకమైన పరిస్థితి ప్రతీ రోజూ  రద్దీగా ఉండే హైదరాబాద్, విజయవాడలలోనూ ఉందని హెచ్చరిస్తున్నారు. 


ఇప్పటినుంచే జాగ్రత్తపడకపోతే మరికొంతకాలంలోనే స్వచ్చమైన గాలిలోకం అల్లాడాల్సిన పరిస్థితి రావచ్చునని కూడా చెబుతున్నారు. మరి మానవులకు ప్రక్రుతిలో గరిష్టంగా లభించే ఆక్సిజన్ రేషియో కూడా గాలిలో మెల్లగా తగ్గిపోవడాన్ని కూడా ఈ నగరాల్లో చూశామని, అది ప్రతీ ఏడాదికి దారుణంగా తగ్గిపోతోందని అంటున్నారు. మరి బీ కేర్ ఫుల్ అంటున్నారు. ప్రతి ఇంటిలో మొక్కలు పెంచడం, వీలైనంతవరకూ బస్సులు. సామూహిక రవాణాను ఎంచుకోవడం, పరిశ్రమల కాలుష్యంపై అంతా కలసి పోరాడి అదుపు చేయడం వంటివి ఇప్పటికిపుడు చేయాలని సూచిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: