పవన్ కల్యాణ్ పేరెత్తితే అంతెత్తున లేచిపోయే కత్తి మహేశ్ ఈసారి వ్యంగ్యంగా రెచ్చిపోయాడు. సీఎం జగన్ తననుద్దేశించి చేసిన వ్యాఖ్యలకు పవన్ ప్రెస్ మీట్లో వ్యంగ్యాస్త్రాలు, సవాళ్లు విసిరిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ వ్యాఖ్యలను కత్తి అందుకున్నాడు. తన ఆలోచనలకు పదును పెట్టి ఫేస్ బుక్ లో పవన్ పై విరుచుకుపడ్డాడు.

 


‘తనలాగా అందర్నీ మూడు పెళ్లిళ్లు చేసుకోమని సలహా ఇచ్చిన పవన్ కళ్యాణ్ కి అభినందనలు. తెలుగుభాష నాకు (తాట తీసే)సంస్కారాన్ని నేర్పింది అంటూ తన మీద తానే ముచ్చటపడ్డ పవన్ కళ్యాణ్. వ్యక్తిగత విమర్శ చెయ్యను చెయ్యను అంటూనే జగన్ ని ఫ్యాక్షనిస్టు అని గౌరవంగా పిల్చిన గాలి పెళ్ళోడికి నా అభినందనలు. తిరుమలలో సుప్రభాతాన్ని ఇంగ్లీషులో చదివించాలనే అద్భుతమైన సలహా ఇచ్చిన పవన్ కళ్యాణ్. విజయవాడ రోడ్లలో కొట్టుకోవడానికి సంసిద్ధత వ్యక్తపరచిన పవన్ కళ్యాణ్. ఇప్పుడే మీటింగ్ నుంచీ జిమ్ కెళ్లారని సమాచారం. ఆల్ ది బెస్ట్. అవును నిజమే... మీరు సరదాపడి మూడు పెళ్లిళ్ళు చేసుకోలేదు. ముందు సరదాపడ్డారు. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అంతే... పాపం! ఉస్కో అంటే మొరిగే కుక్కకి దత్తపుత్రుడి హోదా ఇచ్చి గౌరవించిన ఎంపీ విజయసాయి రెడ్డి గారి విశాల హృదయానికి అభినందనలు’ అంటూ పవన్ పై రెచ్చిపోయాడు.

 


చూస్తుంటే.. కత్తి వర్సెస్ పవన్ ఫ్యాన్స్ వార్ మళ్లీ మొదలయ్యేట్టే ఉంది. పవన్ రాజకీయంగా విమర్శలు చేస్తున్నాడు. కత్తి రాజకీయాల్లో లేడు. కానీ.. కత్తి తన ఫేస్ బుక్ అక్కౌంట్ లో ఇలాంటి వ్యాఖ్యలు చేసి మళ్లీ గొడవకు ఆద్యం పోయడం తగని పని. మరి.. దీనిపై పవన్ ఫ్యాన్స్ రియాక్ట్ అవుతారా.. లేక పవన్ వారించినట్టు పెద్దగా స్పందించకుండా ఉండిపోతారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: