మహా రాజకీయంలో బీజేపీ చాలా తెలివిగా వ్యవహరించింది.  ఈ మొత్తం వ్యవహారాన్ని బీజేపీ తెలివిగా ముందునుంచి పావులు కదుపుతూ వచ్చింది.  మహా ప్రభుత్వం గడువు ముగిసే వరకు వేచి చూసింది. మరో 16 గంటల్లో ప్రభుత్వం సమయం ముగిసిపోతుంది అనగా అప్పుడే ఫడ్నవిస్ వెళ్లి తన రాజీనామాను సమర్పించారు.  రాజీనామాను సమర్పించడం... ఆ వెంటనే రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది.  


దానికి ఆదివారం రాష్ట్రం వరకు అలోచించి ఆదివారం సాయంత్రం ఏర్పాటు,  ఆ వేంటనే శివసేనను పిలిచారు.  సోమవారం సాయంత్రం వరకు గడువు ఇవ్వగా అది ఉపయోగించుకోలేదు.  ఎన్సీపీ, కాంగ్రెస్ లు మద్దతు ఇస్తాయని అనుకుంది.  కానీ, రెండు కూడా వేచి చూడగా సమయం దాటిపోవడంతో ఆ రాత్రి ఎన్సీపీకి పిలుపు వచ్చింది.  ఎన్సీపీ కి మంగళవారం సాయంత్రం వరకు గడువు ఇచ్చినా .. ఆ రోజు మధ్యాహ్నమే రాష్ట్రపతి పాలన సిఫార్సుకు కేంద్రానికి గవర్నర్ లేఖ రాశారు.  


ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా గవర్నర్ 18 పేజీల నివేదికను కేంద్రానికి పంపడం.. వెంటనే కేంద్రం.. ఆ లేఖపై కేబినెట్ లో చర్చించి గంటల వ్యవధిలోనే ఆమోదించి రాష్ట్రపతి పంపడం.. రాష్ట్రపతి దానిపై ఆమోద ముద్రవేయడం జరిగిపోయింది.  రాష్ట్రపతి ముద్ర వేసిన తరువాత కూడా ఎన్సీపీ ప్రభుత్వ ఏర్పాటు కు ముందుకు రాలేదు.  దీంతో అక్కడ అధికారికంగా రాష్ట్రపతి పాలన విధించారు.  


మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధింపుతో అధికారం మొత్తం కేంద్రం చేతుల్లోకి వెళ్ళింది.  శివసేన అనుభవ రాహిత్యంగా, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలను నమ్ముకొని కేంద్రంలో ఉన్న పదవిని కూడా కోల్పోయింది.  ఇటు బీజేపీతో ఉన్న అనుబంధం కూడా తెగిపోయింది.  శివసేన వస్తాను అంటే బీజేపీ కాదనదు.  వస్తే ముఖ్యమంత్రి పదవి ఇవ్వదు.  అలానే, కాంగ్రెస్, ఎన్సీపీతో కలిస్తే.. అది బాల్ థాకరే సిద్ధాంతాలకు విరుద్ధంగా నడిచినట్టు అవుతుంది.  బీజేపీ అధికారం విషయంలో తెలివిగా వ్యవహరించి దెబ్బకొట్టింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: