షేక్ హ్యాండ్ ఎలా ఇస్తారు చేతితోనే కదా. ఎవరైనా కలిస్తే షేక్ హ్యాండ్ ఇస్తే.. మీరేం చేస్తారు.. లాగి ఒక్కటిస్తారు.  రాస్కెల్ అంటూ తిట్టిపోస్తారు.  షేక్ హ్యాండ్ వద్దు ఏమి వద్దని వెళ్ళిపోతారు.  కానీ, ఈ వ్యక్తి మాత్రం కాలితోనే షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అది మాములు వ్యక్తికైతే వార్త ఎందుకు అవుతుంది.  అతను షేక్ హ్యాండ్ ఇచ్చింది ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రికి.  అవును.. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రికి కాలితో షేక్ హ్యాండ్ ఇచ్చాడు.  


ముఖ్యమంత్రి కూడా కాలితో ఇచ్చిన షేక్ హ్యాండ్ ను తీసుకున్నారు.  అదేంటి అని షాక్ అవుతున్నారా.. అక్కడికే వస్తున్నా.. పాపం అతనికి రెండు చేతులు లేవు.  అందుకే కాలితో ఇచ్చాడు.  అసలు సీఎంను ఎందుకు కలిశాడు.  ఈ విషయం తెలియాలంటే అతని గురించి తెలుసుకోవాలి.  అతని పేరు ప్రణయ్.  పుట్టింది కేరళలోని అలతూర్ లో.  పుట్టుకతోనే రెండు చేతులు లేవు.  అప్పటి నుంచి అతనికి రెండు కళ్ళే ఆధారం అయ్యాయి.  


రెండు కాళ్లతోనే తన పనిని తాను చేసుకోవడం మొదలుపెట్టారు.  కాళ్ళు చేతులు సరిగా ఉండి పనులు చేయాలని వ్యక్తులు ఎందరో ఉన్నారు.  వారంతా ప్రణయ్ ను చూసి సిగ్గుపడాలి.  చాలామంది ఏమి చేయకుండా కూర్చొని తింటుంటారు.  వాళ్ళు ఈ ప్రణయ్ స్టోరీని చదివితే.. కన్నీళ్లు కరుస్తారు.  చేతులు లేకపోయినా కళ్ళను ఆసరాగా చేసుకొని పెయింటింగ్ వేయడం మొదలుపెట్టాడు.  


ఏవో అల్లాటప్పా పెయింటింగ్ అనుకుంటే పొరపాటే.. చాలా నీట్ గా పెయింటింగ్ వేస్తాడు.  అతని పెయింటింగ్స్ కు కేరళలోనే కాదు విదేశాల్లో కూడా ఎక్కువగా అమ్ముడు అవుతుంటాయి.  ఆలా పెయింటింగ్ వేయగా వచ్చిన కొంత డబ్బును తన అవసరాలకే కాకుండా ప్రజలకు కూడా ఉపయోగపడాలని చెప్పి విరాళాలు ఇస్తుంటాడు.  ఇలా కేరళ సీఎం సహాయనిధికి విరాళం ఇచ్చేందుకు మంగళవారం రోజున ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళాడు.  అక్కడ సీఎం కు చెక్ అందజేశాడు.  కాళ్లలో షేక్ హ్యాండ్ ఇచ్చాడు.  ముఖ్యమంత్రి ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేయడంతో ఈ వార్త వైరల్ అయ్యింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: