రోజు రోజుకి దొంగల బెడద ఎక్కువ అయిపోతుంది. చిన్న చిన్న దొంగతనాలు చేయడం మానేసి భారీ దొంగతనాలె  లక్ష్యంగా పెట్టుకున్నారు దొంగలు. ఒకే ఒక్కసారి భారి  దొంగతనం చేసి దోచేస్తే  లైఫ్ సెట్ చేసుకోవచ్చు అనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక దొంగతనం చేయడం కూడా పక్క ప్లాన్ తో  చేసి అందినకాడికి దోచుకుంటున్నారు. భాగ్యనగరంలో అయితే రోజు ఓ  దొంగతనం తెరమీదికి వస్తూనే ఉంది. దొంగతనం వృత్తిగా మార్చుకున్న దొంగలు అందినకాడికి దోచుకుని పోతున్నారు. ఇక భాగ్యనగరంలో ఇంటా బయటా దొంగలు బెడతా రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు తాజాగా సికింద్రాబాద్ లో మరో దొంగతనం తెరమీదికి వచ్చింది. 

 

 

 

 సికింద్రాబాద్ లో గత రాత్రి చోరీ జరిగింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న ఓ వ్యక్తి కళ్ళల్లో పేపర్స్ స్ప్రే కొట్టి  అతడి వద్ద నుంచి 30 లక్షల ఉన్న  సంచీ లాక్కొని అక్కడి నుంచి పరారయ్యారు దుండగులు. మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా ఈ ఘటన  స్థానికంగా కలకలం రేపింది. అయితే ఈ ఘటనపై సదరు బాధితులు పోలీసులకు పిర్యాదు చేసారు . కాగా  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మహంకాళి ఆలయ సమీపంలో రోహిత్  అనే తయారీ వ్యాపారి దుకాణం, నవకర్ అనే  నగల విక్రయ వ్యాపారి  దుకాణాలు ఉన్నాయి. అయితే ఈ రెండు దుకాణాలు మధ్య తరచూ లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. నగల తయారీ షాపు నడుపుతున్న రోహిత్  నుండి నగలను కొనుగోలు చేసి నవకర్ తన షాపులో  విక్రయిస్తుంటారు. 

 

 

 

 అయితే ఈ క్రమంలో రోహిత్ షాప్ నుండి తయారుచేసిన నగలను నవకర్  కొనుగోలు చేసే విక్రయించాడు. అయితే దీనికి సంబంధించిన 30 లక్షల ను రోహిత్ కు నవకర్ చెల్లించాల్సి ఉంది. దీనికోసం రోహిత్  షాప్ కు  చెందిన రూపారామ్  అనే వ్యక్తి నవకర్ నుంచి  తమకు రావాల్సిన 30 లక్షలు  డబ్బులు తీసుకునే షాప్ కి బయలుదేరారు.ఈ క్రమంలోనే తమ షాప్  వద్దకు వచ్చి  మెట్లు  ఎక్కుతుండగా... మొదటి అంతస్తు సెల్లర్ లో  వేచివున్న దుండగులు...  30 లక్షల సంచితో వస్తున్న రూపారామ్  అనే వ్యక్తిపై పేపర్ ఫ్రై చల్లి  డబ్బులు లాక్కొని ద్విచక్ర వాహనంపై పరారయ్యారు. దీంతో బాధితుడి  ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల  కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: