మాములుగా స్నేహం చేస్తే ఎవరైనా దేనితో చేస్తారు.. కుక్కలు, పిల్లులు, ఇంకా చెప్పాలి ఇంట్లో కొందరు సింహాలు, పులులు కూడా పెంచుకుంటారు.  పాములు, కొండచిలువలను పెంచుకోరు.  ఒకవేళ పెంచుకున్న చిన్నగా ఉన్నప్పుడు పెంచుకుంటారు.  పెద్దయ్యాక వాటిని అడవిలోకి తీసుకెళ్లి వదిలేస్తారు.  కానీ, ఇంగ్లాండ్ కు చెందిన మార్కర్ అనే వ్యక్తి ఇంట్లో ఏకంగా ఓ కొండచిలువను పెంచుతున్నాడు.  


అది ఇప్పుడు 18 అడుగుల పొడవు పెరిగింది. ఐదారు అడుగుల పొడవున్న కొండచిలువలు చూస్తేనే భయపడి గుండెలు ఆగిపోతాయి.  కానీ, 18 అడుగుల పొడవున్న కొండచిలువను చూసి... ఆ వ్యక్తి ఎలాంటి భయం చెందటం లేదు.  పైగా దానికి తన ఇంట్లోనే గదిని కేటాయించాడు.  తనతో పాటే ఇంట్లో ఉంటుంది.  అప్పుడప్పుడు షికారు కోసం పక్కనే ఉన్న అడవికి తీసుకెళ్తాడట.  


మనుషుల్ని చూస్తే చుట్టేసి ఎముకలుపిప్పిచేసి మింగేసే కొండచిలువలను పెంచుకోవడం ఎంతవరకు సమంజసం చెప్పండి.  మంచిది కాదుకదా.  కానీ, సదరు వ్యక్తి మాత్రం ఈ కొండచిలువను అపురూపంగా పెంచుకుంటుంటున్నాడు.  తన దగ్గరకు వచ్చినపుడు ఈ కొండచిలువ 8 అంగుళాలు ఉందట.  ఇప్పుడు అది 18 అడుగులకు పెరిగింది. 


ప్రపంచంలోనే అత్యంత పొడవైన కొండచిలువ పొడవు 18.8 అడుగులు.  ఇది ఆ రికార్డును బ్రేక్ చేసి గిన్నిస్ లో ఎక్కుతుందని అంటున్నాడు మార్కర్.  ఇక మార్కర్ కు ఆ ఇంట్లోనే ముగ్గురు పిల్లలు ఉన్నారు.  వారంతా చిన్న పిల్లలు.  పొరపాటున ఆ కొండచిలువ కంట్లో పడ్డారు అంటే.. అప్పడంలా నమిలేస్తుంది.  కానీ, దానికి దూరంగా ఉంచుకున్నాడట మార్కర్.  ఈ కొండచిలువ కోసం రోజు కుందేళ్లు, దుప్పులు, మాంసం, పందులను ఆహారంగా వేస్తుంటాడట.  దీని కోసం రోజు భారీగా ఖర్చు చేస్తున్నాడు.  ఇది నెలకు ఒకసారి మాత్రమే విసర్జన చేస్తుందట.  


మరింత సమాచారం తెలుసుకోండి: