ఆశ ఎంత అందమైనదంటే అది రూపంలేని సుందరాంగి వంటిది. మనసులో కలిగినప్పుడు బాగానే ఉంటుంది. కాని దాని పర్యావసనం మాత్రం కాకరకాయకంటే చేదుగా ఉంటుంది. దీని వలలో పడి ఎందరో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అమ్మాయిలైతే ఆశను చంపుకోలేక తమజీవితాలను చీకటిపాలు చేసుకుంటున్నారు. ఈ ఆశకు కన్నవారు, కట్టుకున్న వారు, బందువులు అంటూ తేడా ఏమి ఉండదు. అందరిని తన విషపు కొరలకు బలి చేస్తుంది.


ఇకపోతే ఈ మధ్యకాలంలో ఆడపిల్లగా పుట్టడమే మహా శాపంగా మారింది. ఎక్కడ చూడు ఆడపిల్లలపై అఘాయిత్యాలు ఎన్నో జరుగుతున్నాయి. వారి భవిష్యత్తుకు భరోసాను ఎవరు ఇవ్వలేక పోతున్నారు. ముసలి వాని దగ్గరి నుండి మీసాలు కూడ సరిగ్గా రాని వాడు కూడా ఆడపిల్లలంటే అలుసుగా చూస్తున్నారు. అందులో చిన్న పిల్లల అమాయకత్వాన్ని ఆసరగా చేసుకుని వారి ప్రాణాలు తోడేస్తున్నారు. ఇదే కాకుండా కొందరు కన్న తల్లులు కూడ ఆడపిల్లలపట్ల నిర్లక్ష్యంగా ఉంటున్నారు. అంతే కాకుండా వారి పాలిట శాపంగా కూడా మారుతున్నారు.


ఇకపోతే ఓ మహాతల్లి డబ్బుకు ఆశపడి కన్నబిడ్ద జీవితాన్ని నాశనం చేయాలని చూసింది. వచ్చే డబ్బుకోసం తొమ్మిదేళ్ల చిన్నారికి పెళ్లి చేయాలని చూసింది. కాని సకాలంలో స్దానికులు స్పందించదంతో ఆ పాపకు ముప్పు తప్పింది. ఇప్పుడు ఆ మహిళను ఔరంగాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ జిల్లా మజల్‌గావ్‌లో చోటు చేసుకుంది.


రూ. 30 వేల కోసం ఆశామతి గోలప్‌ అనే మహిళ తన కన్న బిడ్డను, మిత్రురాలి కొడుక్కిచ్చి బాల్యవివాహం చేయడానికి నిశ్చయించింది. ఆదివారానికి పెళ్లి ముహూర్తం పెట్టుకోగా, స్థానికులు అందించిన సమాచారం మేరకు పోలీసులు పెళ్లి వేదికకు చేరుకుని ఆరుగురిని అరెస్టు చేశారు. నిందితులపై బాల్య వివాహాల చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు... 


మరింత సమాచారం తెలుసుకోండి: