సినిమా లో చూసి జనాలు బాగా ప్రభావితం అవుతారు. సినిమాటిక్ రేంజ్ లో హత్యలు చేయడం... సినిమాలో లాగానే  తాము కూడా చేయాలనుకోవడం. ఇలా సినిమాటిక్ హత్యలు ఈ మధ్య కాలంలో  తెర మీదికి చాలానే వచ్చాయి.  దీనిపై విచారణ చేసిన పోలీసులు కూడా ఈ సినిమాటిక్ హత్యలు  చూసి షాక్ కి గురయ్యాడు . ఇలాంటి ఘటనే మరొకటి తెరమీదికి వచ్చింది. ఈసారి ఓ వ్యక్తి హత్య చేశాడు. ఎవరినో కాదండీ తనని తానే హత్య చేసినట్లుగా చిత్రీకరించనున్నారు. కానీ చివరికి పోలీసులకు దొరికిపోయి కటకటాలపాలయ్యాడు. రైతులకు ఇవ్వాల్సిన రెండు కోట్ల రూపాయలను ఎగ్గొట్టేందుకు ఆ వ్యక్తి వేసిన హత్య పథకం బెడిసికొట్టింది. పశ్చిమగోదావరి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. 

 

 

 వివరాల్లోకి వెళితే... కామవరపుకోట మండలం రామన్నపాలెం కి చెందిన సాయి దుర్గరావు ఓ వ్యాపారి. ఏలూరు మండలం సుదిమల్ల సమీపంలో ఉన్న మొక్కజొన్న  గోదాం యజమాని శ్రీనివాసరావు సాయి దుర్గారావుకు 80 లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉంది. సాయి దుర్గారావు రైతులకు రెండు కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సి ఉంది. అయితే రైతులకు ఇవ్వాల్సిన రెండు కోట్ల రూపాయలు చెల్లించకుండా తప్పించుకునేందుకు సాయిదుర్గరావు  అనే వ్యక్తి ఓ పథకం పన్నాడు. శ్రీనివాసరావు అనే వ్యాపారి తనను హత్య చేసినట్లు చిత్రీకరిస్తే రైతులు తాను చనిపోయానని నమ్మడంతో  ఇక రెండు కోట్లు ఇవ్వాల్సిన అవసరం ఉందని భావించాడు సాయిదుర్గరావు . అనుకున్నదే తడవుగా సినిమాటిక్ రేంజ్ లో పథకాన్ని అమలు చేశాడు. ఈనెల 22న తనకు  రావాల్సిన డబ్బులు కోసం శ్రీనివాసరావు దగ్గరకు వెళ్తున్న కుటుంబసభ్యులకు చెప్పి బయలుదేరాడు సాయిదుర్గారావు. ఇక వెళ్తూ వెళ్తూ పథకాన్ని అమలు చేశాడు. కోడి  రక్తాన్ని మొక్కజొన్న ఫ్యాక్టరీ దగ్గర చల్లి తన కళ్ళజోడును అక్కడే పడేసాడు. ఆ తర్వాత తన ద్విచక్ర వాహనాన్ని ఏలూరులోని కాలువలోకి తోసేసి అదృశ్యమై పోయాడు.

 

 

 

 డబ్బుల కోసం శ్రీనివాసరావు వద్దకు వెళ్లిన సాయిదుర్గారావు  తిరిగి ఇంటికి రాలేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు కుటుంబసభ్యులు. దీంతో పోలీసులు సాయిదుర్గరావు కోసం తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. దీంతో అతడి కుటుంబ సభ్యుల ఫోన్లపై నిఘా పెట్టారు పోలీసులు. ఈ క్రమంలో పోలీసులకు  విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. సాయి దుర్గరావ్ బతికే ఉన్నాడని అతని కుటుంబ సభ్యులతో టచ్ లో ఉన్నాడు అంటూ పోలీసుల నిర్థారించారు . ఇక చాకచక్యంగా వ్యవహరించి నిన్న ఏలూరులోని జాతీయ రహదారిపై సాయి దుర్గారావు అరెస్ట్ చేశారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: