ప్ర‌పంచంలో ఉన్న దేశాల్లో ఒక్కో చోట మ‌నుష్యుల క‌ష్టాలు ఒక్కోలా ఉంటాయి. కొన్ని చోట్ల తిన్న‌ది అర‌క్క మ‌నుష్యులు ప్ర‌వ‌ర్తిస్తుంటారు. మ‌రి కొన్ని చోట్ల క‌డుపు నింపుకునేందుకు త‌ప్పుడు ప‌నులు చేయ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. ఇక మ‌హిళ‌ల్లో చాలా మంది ఐశ్వ‌ర్యం, జ‌ల్సాలు, సుఖం కోసం వ్య‌భిచారం చేసే వాళ్లు ఉన్నారు... అలాగే క‌డుపు నింపుకునేందుకు, కుటుంబాల‌ను పోషించుకునేందుకు ప‌క్క సుఖం పంచుకుని డ‌బ్బులు సంపాదించే వాళ్లు కూడా ఉన్నారు. ఇక ఈ క్ర‌మంలోనే కెన్యాలో కొంద‌రు క‌డుపు నింపుకునేందుకు వ్య‌భిచారం చేస్తున్నారు.


ఆఫ్రికాలో చాలా దేశాల్లో ప్రజలు ఇంకా ఆకలితో అలమటించిపోతున్నారు. ఇక భర్తలు లేని ఆడవారి పరిస్థితి,మరీ దారుణంగా ఉంటుంది. పిల్ల‌ల‌ను పోషించేందుకు, క‌డుపు నింపుకునేందుకు వాడు ప‌డే బాధ‌లు వ‌ర్ణ‌నాతీతం. కెన్యాలోని మారుమూల ప్రాంతం అయినా హోమాయిలో ప్రజలు ఒక్క పూట తిండి దొరికి తే చాలు అనుకు నే ప‌రిస్థితుల్లో ఉన్నారు. అక్క‌డ మ‌హిళ‌లు ప‌డుతోన్న బాధ‌లు అన్ని ఇన్నీ కావు.


అక్క‌డ స‌ముద్ర‌పు ఒడ్డున ప‌ట్టే చేప‌లే వారి ఆహారం.. ఆధారం. ఈ క్ర‌మంలోనే వారికి చేపలు దొరికినన్ని రోజులు పరిస్థితి బాగానే ఉంటుంది. దొరకకపోతే అక్కడి జాలర్లను అడిగి చేపలు తీసుకోవాలి. వాటిని అమ్ము కోవాలి. అప్పుడే వాళ్ల‌కు పూట గ‌డ‌వ‌డంతో పాటు వాళ్ల పిల్ల‌ల‌కు తిండి దొరుకుతుంది. ఇక చేప‌లు ఇవ్వాలంటే ఆ టైంలో మ‌హిళ‌ల బ‌ల‌హీన‌త‌ల‌ను ఆస‌ర‌గా చేసుకుని వారు త‌మ‌కు సుఖం ఇవ్వాల‌న్న కండీష‌న్లు పెడుతుంటారు.


అక్క‌డ పేద మ‌హిళ‌లు జాల‌ర్ల‌కు సెక్స్ కోరిక తీర్చాక వారిచ్చే చేప‌ల‌ను అమ్ముకుని పిల్లలను పోషించుకుంటూ ఉంటారు. ఈ పద్దతిని జజ్వా అంటారు. వేలాది మంది మహిళలు ఈ పద్దతిలోనే తమ పిల్లలను పోషించుకుని జీవనం సాగిస్తూ ఉంటారు. అక్కడి ఆడవారికి ఇది తప్ప మరో మార్గం లేదట.


మరింత సమాచారం తెలుసుకోండి: