ఆంధ్రప్రదేశ్ లో 150 కోట్ల రూపాయల మేర భారీ స్కాం జరిగింది. ఇల వందల కోట్లు కాజేసిన వారు రాజకీయాలను కూడా శాసించిన  ప్రముఖుడు  అని అంటున్నారు. ఆయన ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తి అని కూడా కొన్ని గుర్తులు చెబుతున్నారు. పైగా హవాల వ్యాపారులతో సదరు వ్యక్తికి సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా కూడా పేర్కొంటున్నారు. ఎవరా ప్రముఖుడు .. ఏమా కధ...?


ఏపీలో 2014 నుంచి 2019 మధ్య ఏర్పాటైన ప్రభుత్వంలో ఆ వ్యక్తి కీలకమైన పాత్ర పోషించారని అంటున్నారు. దాంతో అందరి చూపులు అయిదేళ్ళ నాటి  రాజకీయాల వైపు మళ్ళుతున్నాయి. బోగస్‌ బిల్లులు పెట్టి భారీగా డబ్బు తీసుకున్న వాళ్లు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖుడొకరికి రూ. 150 కోట్లు ముట్టజెప్పారంటూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) వెల్లడించడంతో ఇపుడు  అది రెండు తెలుగు రాష్త్రాలలో సంచలమైపోయింది. గత ఏడాది వరసగా ఆదాయపన్నుల శాఖ చేసిన దాడులలో ఈ లింకులు బయటపడ్డాయని సీబీడీటీ అధికారి ఒకరు చెప్పడం విశేషం. మరి ఆ ప్రముఖుడు ఎవరు అన్నదే పెద్ద చర్చగా ఉంది. పైగా గత ప్రభుత్వం అనడంతో తెలుగు రాజకీయ పార్టీల్లో  అంతటి పెద్ద మనుషులు ఎవరా అన్న చర్చ కూడా సాగుతోంది.


పెద్ద ఎత్తున భోగస్ కంపెనీలు స్రుష్టించి భోగస్ బిల్లులు పెట్టి  కోట్లు కాజేసిన వారు ఎవరై ఉంటారా అన్న చర్చ ఇలా సాగుతూండగానే ఇది పెద్ద స్కాం అని అర్ధం అవుతోందంటున్నారు. ఇక ఈ మొత్తం వ్యవహారంలో హవాలా వ్యాపారుల పాత్ర కూడా ఉన్నట్లుగా ఆదాయపు పన్నుల శాఖ అధికారులు గుర్తిస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఈ వ్యవహారంలో కీలక మలుపులు మరిన్ని చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.  ఆ ముఖ్య నాయకుడు ఎవరో అన్నది ఎవరి ఆలోచనలు వారికి ఉన్నా గత ఏడాది వరసగా కొన్ని నెలల పాటు ప్రముఖులు, రాజకీయ నేతల ఇళ్లల్లో జరిగిన ఐటీ దాడులను కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. మరి ఈ లింకులన్నీ ఎక్కడ మొదలై ఎక్కడ ఎండ్ అయ్యాయన్నది కూడా చూడాల్సివుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: