తెలంగాణలో టీఎస్ఆర్టీసీ సమ్మె నలభై వ రోజుకి చేరుకుంది.  ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె ఇంతకింతకూ ఉద‌్రిక్తంగా మారుతోంది. తెలంగాణ ఆర్టీసీ సమ్మెలో ఆవేదనా భరిత ఘట్టాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు ఇరవై మందికి పైగా ఆత్మహత్యలు చేసుకున్నారు. రోజు రోజుకీ  వాతావరణం గంభీరంగా మారిన పరిస్థితుల్లోనూ పట్టుదలలు కొనసాగుతున్నారు ఆర్టీసీ కార్మికులు. ఆర్టీసీ సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదనతో ఖమ్మంలో ఆత్మహత్యాయత్నం చేసిన డ్రైవర్‌ శ్రీనివాసరెడ్డి హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ  కన్నుమూశారు. ఆయన తుదిశ్వాస విడిచిన కొద్ది గంటల్లోనే  హైదరాబాద్‌లో కండక్టర్‌ సురేందర్‌గౌడ్‌ తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.  రాణిగంజ్ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్న సురేందర్ గౌడ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 


కార్మికుల ఆత్మహత్యలు ప్రభుత్వం చేసిన హత్యలేనని విపక్ష నేతలు, ఆర్టీసీ కార్మికులు ఆరోపిస్తున్నారు.  ఆర్టీసీలో పని చేస్తున్న కండక్టర్ నీరజ తన యింటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇలా ప్రతి రోజు ఎక్కడో అక్కడ ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వానికి ఏమాత్రం కనికరం లేదని ఆరోపిస్తున్నారు ఆర్టీసీ జేఏసీ.  ఈ మద్య ట్యాంక్ బండ్ పై మిలియన్ మార్చి కార్యక్రమంలో ఆర్టీసీ కార్మికులపై పోలీసులు లాఠీ చార్జి చేశారు. ఆడా, మగా అనే తేడా లేకుండా తమను దారుణంగా కొట్టారని కార్మికులు ఆరోపించారు.  ప్రస్తుతం ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వానికి మద్యే మార్గాన్ని ఏర్పాటు చేయడానికి హై కోర్టు ప్రయత్నిస్తుంది.


తాజాగా  తెలంగాణలో మరో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబాబాద్ డిపోలో నరేశ్ అనే వ్యక్తి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.  నెల రోజులకుపైగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో మనస్థాపానికి గురయ్యారు.  మరోవైపు ఉద్యోగాలు పోతాయని ప్రభుత్వం హెచ్చరించడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఈ ఉదయం పురుగుల మందు తాగేశాడు. ఇది తమనించి కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నరేశ్ మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: