ఇటీవల శంషాబాద్ ఎయిర్ పోర్టులో అసాంఘిక కార్యకలాపాలు  జరుగుతున్నాయన్న  సమాచారంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం తెల్లవారుజామున కార్డన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహిచారు. ఈ ఆపరేషన్ లో పోలీసులు ఊహించినట్టుగానే  కొందరు అనుమానితులు చిక్కారు. మొత్తం ఏడుగురు అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 


విమానాశ్రయంలో జరిగిన ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ లో మొత్తం 100 మంది పోలీసులు పాల్గొన్నారు. శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ జరిగింది. ఇందులో ఏసీపీ, ముగ్గురు సీఐలు, ఐదుగురు ఎస్సైలు, 100 మంది కానిస్టేబుల్స్ కలిసి తనిఖీలు నిర్వహించారు. మొత్తం పోలీసు సిబ్బంది పకడ్బందీగా ఎయిర్‌పోర్ట్‌ను జల్లెడపట్టారు. అంతర్జాతీయ టెర్మినల్ ఆర్టీసీ బస్ స్టాండ్ పార్కింగ్ ప్రదేశంలో క్షుణంగా తనిఖీలు నిర్వహించారు. అనుమతులు లేకుండా తిరుగుతున్న ట్యాక్సీలను తనిఖీ చేశారు. ప్రతి ఒక్క వాహానానికి సంబంధించిన డాక్యుమెంట్లను  క్షుణ్ణంగా పరిశీలించారు. మొత్తం ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 


ప్రతి ఒక్కరి వివరాలను సేకరించిన పోలీసులు... ఏడుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని వారికి చెందిన  ఆరు ట్యాక్సీలను జప్తు చేశారు. ఇలా ఎయిర్ పోర్టులో కార్డన్ సెర్చ్ చేయడం ఇదే కొత్త కాదు.. గత జులైలోనూ పోలీసుల కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. అప్పుడు  16 మంది అనుమానితులను పట్టుకున్నారు. 
ఆ సమయంలో అనుమతులు లేకుండా ప్రయాణికులను ఎక్కించుకుంటున్న 12 కార్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికులు పూర్తిగా అనుమతులు ఉన్న ట్యాక్సీలలో ప్రయాణించాలని, లేదంటే ఇబ్బందులు తప్పవని డీసీపీ ప్రకాష్ రెడ్డి హెచ్చరిస్తున్నారు. ప్రయాణీకులూ తస్మాత్ జాగ్రత్త. 
అంతర్జాతీయంగా ప్రముఖ ఎయిర్ పోర్టుల్లో ఒకటిగా ఉన్న శంషా బాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికుల భద్రత కోసం పోలీసులు ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారు. ఇలాంటి కార్డన్ సెర్ట్ ఆపరేషన్ల విషయంలో తమకు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: