మహారాష్ట్ర లో రాష్ట్రపతి పాలన  ఇదేమి తొలిసారి కాదు . ఇప్పటికే రాష్ట్రం లో  రెండుసార్లు రాష్ట్రపతి పాలన  విధించారు . ఇది ముచ్చట మూడవసారి కానుంది . 1980 లో తొలిసారి మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన  విధించారు . శరద్ పవార్  నేతృత్వం లోని ప్రభుత్వానికి సంపూర్ణ మెజార్టీ ఉన్నప్పటికీ , రాష్ట్ర  ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన 112 రోజుల పాటు విధించారు . 2014 లోను మహారాష్ట్ర లో రెండవ సారి రాష్ట్రపతి పాలన  విధించారు .


ఇక మహారాష్ట్ర లో రాష్ట్రపతి పాలన  కు గవర్నర్ సిఫార్సు చేయడం పట్ల పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి   . ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ కి రెండు రోజులు అవకాశం ఇచ్చిన భగత్ సింగ్ కొష్యారి, ఇతర పార్టీలకు మాత్రమే కేవలం 24 గంటలపాటే సమయం ఇవ్వడం , కాంగ్రెస్ ను పట్టించుకోకపోవడం పట్ల రాజ్యాంగ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు . శివసేన నాయకత్వం,  తమకు 48 గంటల సమయం కావాలని కోరిన గవర్నర్ తిరస్కరించడమే కాకుండా , ఎన్సీపీనాయకత్వం  ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పక్షం లో కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఎందుకు ఆహ్వానించలేదన్న ప్రశ్న తలెత్తుతోంది .


అయితే ప్రభుత్వ ఏర్పాటుకు ప్రతి పార్టీ కి ఎంత సమయం కేటాయించాలన్న దానిపై నిర్దిష్ట గడువంటూ ఏమి లేదని , అది  గవర్నర్ విచక్షణాధికారమని మరికొందరు రాజ్యాంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు . అక్టోబర్ 24 న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ఏ పార్టీ కి సంపూర్ణ సంఖ్య బలం లేకపోవడం తో కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు అన్ని పార్టీలు ప్రయత్నాలు చేసి విఫలమయ్యాయని , అందుకే గవర్నర్ , రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేశారన్న అభిప్రాయం పలువురు వ్యక్తం  చేశారు . 


మరింత సమాచారం తెలుసుకోండి: