టీడీపీ కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడటం సంచలనం మారింది . ఎస్సై వేధింపులు భరించలేక టీడీపీ కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు . ఎవరూ లేని సమయంలో ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.. వివరాల్లోకి వెళితే నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ కార్యకర్త అయిన  కార్తీక్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. దగదర్తి ఎస్సై సుబ్బారావ్ గత కొద్దిరోజులుగా కార్తీక్ ను వేధింపులకు గురి చేస్తుండటం తో కార్తీక్ అనే వ్యక్తి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజురోజుకు ఎస్సై వేధింపులు ఎక్కువవడంతో మనస్థాపానికి గురైన టీడీపీ కార్యకర్త  కార్తీక్  ఆత్మహత్యకు పాల్పడ్డారు.. టీడీపీ కార్యకర్త కార్తిక్ వేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో సంచలనం గా మారింది . 

 

 

 అయితే టీడీపీ కార్యకర్త కార్తిక్  ఆత్మహత్య పై స్పందించిన ఆయన కుటుంబ సభ్యులు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలు చెప్పినట్టుగానే నడుచుకోవాలని  ఎస్సై సుబ్బారావ్ కార్తీక్ ను  ఎన్నో రోజులుగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని... ఈ క్రమంలోనే తమకు జీవనోపాధి అయిన హోటల్ ను  కూడా తొలగించారని తెలిపారు. దీంతో మనస్తాపం చెంది కార్తీక్ ఆత్మహత్య చేసుకున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరోవైపు కార్తీక్ కుటుంబ సభ్యులను టిడిపి ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర ఇతర నేతలతో కలిసి పరామర్శించారు. 

 

 

 

 ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్సీ రవిచంద్ర రాష్ట్రంలో  టిడిపి నేతలపై వైసీపీ దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి అంటూ మండిపడ్డారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ ఎస్పీల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినప్పటికి కూడా కనీసం పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. ఇక కిందిస్థాయి అధికారులు కూడా ఉన్నతాధికారుల మాట వినడం  లేదని ఎమ్మెల్సీ రవిచంద్ర అన్నారు. వైసీపీ నేతలు చెప్పినట్టుగా వినాలంటు  ఎస్సై వేధింపులకు గురి చేయడం వల్లే కార్తీక్  ఆత్మహత్య చేసుకున్నడంటూ  విమర్శించాడు . ఇది ముమ్మాటికీ వైసీపీ నేతల కోసం ఎస్సై చేసిన హత్య అంటూ ఆయన  ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: