ప్రస్తుతం ఒక నవ్వోచ్చేంత నిజాయితీగా రూపొందించిన వెడ్డింగ్ కార్డు నెట్టింట వైరల్ అవుతుంది. ఈ సృజనాత్మక వెడ్డింగ్ కార్డుని ప్రముఖ హిందీ హాస్య నటుడు అక్షర్ పఠాక్ రూపొందించాడు. అయితే ఇటీవల కాలంలో వెడ్డింగ్ కార్డులలో ముఖ్యంగా, ఇంకా ఎక్కువగా వాడే శైలిని వెక్కిరిస్తూ ఈ కార్డు ని డిజైన్ చేసి అందర్నీ నవ్విస్తున్నాడు ఈ అక్షర్ పఠాక్. 


శర్మా జీ కా లడఖా తో వర్మ జీ కి లడకీ పెళ్లి జరగనుందని దీనికి #షావర్మ గా హాష్ ట్యాగ్ జతచేసి ప్రస్తుత హాష్ ట్యాగ్ ట్రెండ్ ని వేగతాళి చేసాడు. ఇంకో లైన్ లో ' చూసారా? మా వెడ్డింగ్ కార్డు ని మేం ఎంతో ఖర్చు పెట్టి రూపొందించామో. అంబానీ వాళ్ళ కంటే మేం ఏం తక్కువ కాదు.' అని వేదిక గురించి ఫన్నీ గా రాసారు.


కార్డు చివర్లో.., "దయచేసి గిఫ్టులు ఏం తీసుకురాకండి, డబ్బు మాత్రమే ఇవ్వండి. ఎందుకంటె, మీరిచ్చే 18 జ్యూసర్ మిక్సర్ గ్రైండర్ లతో మేమేం చేసుకుంటాం." అంటూ నిజాయితీగా రాసారు. ఇప్పటికే ఈ వెడ్డింగ్ కార్డు ని 3లక్షల మందికి పైగా చూశారు. ఈ వైరల్ అవుతున్న కార్డు పై నెటిజన్లు కామెంట్లు చేస్తూ, అమ్రిష్ పురి, ఆవో ఆవో, దిల్వాలే దుల్హానియే లే జాయేంగే అనే టైటిళ్లతో మెనూలో ఫుడ్ కూడా ముందే చెప్పాల్సిందని సలహాలిస్తున్నారు. 


కొందరు ఈ వెడ్డింగ్ కార్డు చూసి వాళ్ళ మ్యారేజ్ కోసం కూడా ఇలాంటిదే రూపొందించుకుంటాం అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వెడ్డింగ్ కార్డు లో రాసినట్లుగానే.... అందరు 'మాకు గిఫ్ట్స్ వద్దు కాష్ మాత్రమే కావాలని' అనుకుంటారంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. ఒకతనమో, 'మా చెల్లికి వెడ్డింగ్ కార్డు ఎలా డిజైన్ చేయాలో ఈ కార్డు ద్వారా చూపించినందుకు థాంక్స్', అంటూ కామెంట్ చేసాడు.  అయితే దీనిని కేవలం ప్రస్తుత వెడ్డింగ్ కార్డుల డిజైన్లను వేగతాళి చేయాలనే ఉద్దేశంతో రూపొందించాడు ఈ కమెడియన్ అక్షర్ పఠాక్.


మరింత సమాచారం తెలుసుకోండి: