ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు తలపెట్టిన ఇసుక దీక్ష, రాజకీయ విమర్శలపైనా  చర్చ జరిగే అవకాశం ఉన్నాయి. బుధవారం ఉదయం 11.30 గంటలకు ముఖ్యమంత్రి వై వైస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరగనున్నది. ఇందులో ప్రధానంగా ఇసుక అంశంపై చర్చ జరగనున్నట్టు సమాచారం. ఈ క్రమంలో  ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాపై భారీగా జరిమానా, జైలు శిక్ష వేసేలా చట్టంలో సవరణలకు మంత్రి మండలి నిర్ణయం తీసుకోనుంది. గురువారం టీడీపీ అధినేత చంద్రబాబు ఇసుక సమస్యపై దీక్ష చేపడుతున్న నేపథ్యంలో కేబినెట్‌ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఇసుక ధరలపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకోనున్నారు. ఖరారుచేసిన దానికంటే ఎక్కువ రేటుకు అమ్మితే.. రెండేళ్ల జైలు శిక్షను విధించేందుకు ఆమోదం తెలుపనున్నారు.


కాగా ఈ నెల 14 నుంచి జరపతలపెట్టిన ఇసుక వారోత్సవాలు నిర్వహణపైన కూడా క్యాబినెట్ లో చర్చ జరపనున్నారు. దాంతోపాటుగా ఏపీ మైనర్ మినరల్స్ కన్సెషన్ రూల్స్ లో సవరణలకు క్యాబినెట్ ఆమోదం తెలపనున్నట్టు తెలుస్తుంది. ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 6వ తరగతి వరకూ ఇంగ్లీష్ మీడియం అమలుకు క్యాబినెట్ ఆమోదం తెలపనున్నట్టు సమాచారం. ఏపీ కాలుష్య నిర్వహణ సంస్థ ఏర్పాటుకు  మంత్రివర్గం ఆమోదం తెలపనున్నది. ప్రతి నెలా రెండు కేబినెట్‌ సమావేశాలను నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయుంచిన సంగతి తెలిసిందే.



పట్టణాల్లో అక్రమ లే అవుట్ల క్రమబద్దీకరణపైన ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తుంది. గ్రామ న్యాయాలయాల ఏర్పాటు, న్యావాదులకు సంక్షేమ నిధిపై క్యాబినెట్  చర్చించనున్నట్టు సమాచారం. ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారులకు 10 లక్షల ఆర్థిక సాయం ఇచ్చేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా సింగపూర్ తో స్టార్టప్ ఏరియా రద్దుకు క్యాబినెట్ ఆమోదం తెలపనున్నట్టు విశ్వనీయ సమాచారం. అదే క్రమంలో ప్రభుత్వ భూముల అమ్మకాలు, బిల్డ్ ఏపీ పై కూడా క్యాబినెట్ చర్చించే అవకాశాలు ఉన్నాయి.  



మరింత సమాచారం తెలుసుకోండి: