2018లో కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి.  ఆ ఎన్నికల్లో ఏ పార్టీకి సరైన మెజారిటీ ఇవలేదు.  కర్ణాటకలో పెద్ద పార్టీగా బీజేపీ అవతరించినా, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అడుగు దూరంలో ఆగిపోయింది.  దీంతో కాంగ్రెస్, జేడీఎస్ లు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.  సరిగ్గా 13 నెలల తరువాత కర్ణాటకలో 17 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.  రాజీనామాను కర్ణాటక స్పీకర్ అంగీకరిస్తూనే.. వారిపై అనర్హత వేటు వేసింది. 13 అసెంబ్లీ పూర్తయ్యే వరకు వారు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా అనర్హత వేటు వేసింది.  


ఆ తరువాత జరిగిన నాటకీయ పరిణామాల మధ్య కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వం కూలిపోయింది.  ప్రభుత్వం కూలిపోవడం.. ఆ స్థానంలో బీజేపీ అధికారంలోకి రావడం మెజారిటీ నిరూపించుకోవడం జరిగిపోయాయి. 17 మంది ఎమ్మెల్యేలు అనర్హత వేటు పడిన తరువాత వారు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.  సుప్రీం కోర్టులో ఈ కేసు పెండింగ్ లో ఉండగానే, కర్ణాటకలో 17 అసెంబ్లీ నియోజక వర్గాలకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉన్నది.  


కానీ, సుప్రీం కోర్టులో కేసు పెండింగ్ లో ఉండటం వలన అక్కడ ఎన్నికలు వాయిదా వేసింది.  డిసెంబర్ 5 వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి.  కాగా, ఈకేసులో ఈరోజు తీర్పును వెలువరించండి సుప్రీం కోర్టు.  కర్ణాటక మాజీ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీం కోర్టు సమర్ధించింది.  అయితే, 2025 వరకు అనర్హత వేటును తగ్గించి, అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు ఉప ఎన్నికల్లో పోటీ చేసే విధంగా తీర్పు ఇచ్చింది. 


ఈ తీర్పుతో 17 మంది అనర్హత ఎమ్మెల్యేలు ఇప్పుడు బీజేపీ తరపున పోటీ చేయబోతున్నారు.  ఈరోజు ముఖ్యమంత్రి యడ్యూరప్పను కలవబోతున్నారు.  17 మంది ఎమ్మెల్యేలు పోటీకి సంబంధించిన విషయాలను ఈరోజు చర్చించబోతున్నారు.  ఈ 17 మంది ఎమ్మెల్యేలలో కనీసం 15 మందినైనా బీజేపీ గెలిపించుకోవాలి.  అప్పుడే ప్రభుత్వం నిలబడుతుంది.  భవిష్యత్తులో ఇబ్బందులు పడకుండా ఉంటుంది.  మరి 17 మంది ఎమ్మెల్యేలను బీజేపీ గెలిపించుకుంటుందా చూద్దాం.  


మరింత సమాచారం తెలుసుకోండి: