ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ సంస్థాగతంగా వలోపేతమయేందుకు భారతీయ జనతా పార్టీ అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలోనే ఇతర పార్టీల నాయకులను ఆకర్షించే ప్రయత్నాలు చేపట్టిన సంగతి తెలిసిందే. అదేవిధంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆ పార్టీ కేంద్ర మంత్రి ఏపీపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించినట్టు తెలుస్తుంది. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్( జీవీఎంసీ)లో కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు తీరుపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించనున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం నగరానికి వచ్చిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి బుధవారం ఉదయం 11 గంటలకు జీవీఎంసీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించనున్నారు.


అక్కడ సమావేశ మందిరంలో జీవీఎంసీ కమిషనర్‌తో పాటు అన్ని విభాగాల అధిపతులు, ముఖ్య అధికారులతో కలిసి సమీక్ష నిర్వహిస్తారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో జీవీఎంసీ పరిధిలో పలు ప్రాజెక్టులు అమలవుతున్నాయి. వీటిలో ప్రధానంగా స్మార్ట్‌సిటీ కింద రూ.400 కోట్లతో అనేక పనులు జరుగుతున్నాయి. అలాగే అమృత్‌ కింద రూ.33 కోట్లతో భూగర్భ డ్రైనేజీ పనులు, మరో రూ.75 కోట్లతో యూజీడీ కొత్త కనెక్షన్లు ఇచ్చే పనులు, రూ.154 కోట్లతో నిరంతర నీటి సరఫరా ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు గ్రాంటు కింద రూ.325 కోట్లతో విశాఖ-చెన్నై కారిడార్‌ పనులు జరుగుతున్నాయి.



వీటన్నింటిపైనా మంత్రి కిషన్‌ రెడ్డి జీవీఎంసీ అధికారులతో సమీక్షించనున్నారు. మంత్రి సమీక్షకు సంబంధించిన ఏర్పాట్లలో జీవీఎంసీ అధికారులు తలమునకలై ఉన్నారు. ఇదిలా ఉండగా జిల్లాలో తమ ఉనికిని కాపాడుకునేందుకు కలనాధులు తమదైన శైలితో హంగామా చేస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటనలో భాగంగానే పార్టీ బలోపేతానికి చర్యలు చేపడుతున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఇతర పార్టీ నేతలను కలం కండువా కప్పేందుకు సైతం సంనర్ధమవుతున్నట్టు తెలుస్తుంది. అదే విధంగా రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం పాలనలో ఎదురవుతున్న లోపాలను కూడా ఎత్తిచూపేందుకు భాజపా పదాధికారుల కత్తులు దూస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: