క్ష‌ణికావేశంలో చిన్న చిన్న కోరిక‌ల కోసం యువ‌త చేస్తోన్న ప‌నులు వారి ప్రాణాల మీద‌కు తెస్తున్నాయి. కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా ఓ షాకింగ్ విషయాన్ని బయట పెట్టింది. తాజా అధ్య‌య‌నం ప్ర‌కారం దేశంలో 19 రాష్ట్రాల్లో కండోమ్‌ల వాడ‌కం బాగా త‌గ్గిపోయింద‌ట‌. 2000లో సుర‌క్షిత శృంగారం కోసం 38 శాతం మండి కండోమ్‌లు వాడుతుంటే ఇప్పుడు 2018 నాటికి అది కేవ‌లం 24 శాతానికి ప‌డిపోయింద‌ట‌.


పురుషులు భావ ప్రాప్తి కోసం కండోమ్ లు వాడ‌డం లేదు. అందుకే త‌మ‌కు థ్రిల్ ఇవ్వ‌ని కండోమ్ల కంటే వీరు గ‌ర్బ నిరోధ‌క మాత్ర‌లు, కాప‌ర్ టీ ఇంజెక్ష‌న్లు ఎక్కువుగా వాడుతున్నారు. భావప్రాప్తి లో అస్సలు రాజీ పడని పురుషులు ఇలా కండోమ్ వాడకాన్ని పూర్తిగా దూరం పెట్టారని తెలుస్తోంది. అయితే ఈ ప‌నులు స‌మాజానికి పెను ప్ర‌మ‌దం లాంటివ‌ని తెలుస్తోంది. కండోమ్ వాడ‌కుండా అసుర‌క్షిత‌మైన శృంగారం చేస్తే ఆ భాగ‌స్వామికి ఎయిడ్స్ లేదా ఇత‌ర లైంగీక వ్యాధులు సంక్ర‌మించే ప్ర‌మాదం ఉంది.


ఎయిడ్స్ వ్యాధి సోకితే జీవితం క్లోజ్ అయిపోయిన‌ట్టే. మ‌ళ్లీ దేశంలో ఎయిడ్స్ రోగుల సంఖ్య పెర‌గ‌డానికి కండోమ్‌లు వాడ‌క‌పోవ‌డ‌మే అంటున్నారు. అంటే ప‌ది నిమిషాల లైంగీక ఆనందం కోసం వీరు ప్రాణాల‌ను సైతం ప‌ణంగా పెడుతున్నారు. దీని వ‌ల్ల రెండు తెలుగు రాష్ట్రాల‌తో పాటు ఈశాన్య భార‌తంలో రోజు రోజుకు ఎయిడ్స్ రోగుల సంఖ్య పెరుగుతూ వ‌స్తోంది.


ప్రభుత్వం ఈ విషయం లో ఇప్పుడే మేల్కోకుంటే దేశంలో మళ్లీ ఎయిడ్స్ రోగుల సంఖ్య పెరగడం ఖాయమంటున్నారు. ఏదేమైనా దేశంలో ఒక‌ప్పుడు కండోమ్ వాడ‌కం కోసం ప్ర‌భుత్వం చాలా ప్ర‌చారం చేసింది. మ‌ళ్లీ ఇప్పుడు అలాంటి ప్ర‌చారం చేయాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: