ఎవరైనా వింటే ఆశ్చర్యపోతారు. మాజీ ఎంఎల్ఏ చింతమనేని ప్రభాకర్ పై 15 రోజుల్లో 13 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసులు నమోదయ్యాయట. ఈ లెక్క పోలీసులో లేకపోతే వైసిపి నేతలు చెప్పింది కాదు. స్వయంగా తెలుగుదేశంపార్టీ నేతలు అందులోను మాజీ మంత్రులు చెప్పిందే.  ఇక నేతపై ఇన్ని కేసులు పెట్టటం చరిత్రలో ఎన్నడూ జరగలేదంటూ మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, పీతల సుజాతలు ప్రభుత్వంపై మండిపోయారు.

 

నిజానికి మాజీ మంత్రులు చెబుతున్నట్లుగా చింతమనేనిపై ఇన్ని కేసులు నమోదయ్యాయో లేదో తెలీదు.  ప్రభుత్వం మారిన తర్వాత మాత్రం చింతమనేనిపై భారీగానే కేసులు నమోదయ్యింది మాత్రం వాస్తవం. ఎందుకంటే ఈ మాజీ ఎంఎల్ఏ ధౌర్జన్యాలు, దాష్టికాలకు బలైపోయిన కుటుంబాలు చాలానే ఉన్నాయి దెందులూరు నియోజకవర్గంలో.

 

అధికారంలో ఉండటంతో చింతమనేని ఎన్ని ధౌర్జన్యాలు చేసినా దాడులు చేసినా ఎదురులేకపోయింది. బాధితులు మాజీ ఎంఎల్ఏపై ఫిర్యాదు చేయటానికి వెళితే వెంటనే పోలీసులు ఆ విషయాన్ని చింతమనేనికి చెప్పేసేవాళ్ళు. దాంతో మళ్ళీ ఎంఎల్ఏ మనుషులు వెళ్ళి బాధితుల ఇళ్ళపైన దాడి చేసి మళ్ళీ కొట్టేవాళ్ళు.  మొత్తం ఐదేళ్ళు చింతమనేని వ్యవహారం ఇలాగే సాగింది.

 

ఎప్పుడైతే చింతమనేనితో పాటు తెలుగుదేశంపార్టీ కూడా ఘోరంగా ఓడిపోయిందో వెంటనే బాధితులకు ధైర్యం వచ్చింది. అందుకనే చింతమనేని బాధితులంతా ఇపుడు పోలీసుస్టేషన్లో ఫిర్యాదులు చేస్తున్నారు. ఫిర్యాదులు చేస్తున్నారు కాబట్టి పోలీసులు కూడా కేసులు పెట్టేస్తున్నారు. పోలీసులు గతంలో ప్రకటించిన ప్రకారమే మాజీ ఎంఎల్ఏపై సుమారు 60 కేసులు నమోదయ్యాయి.

 

ఇందులో కొన్ని కేసుల్లోనే ప్రస్తుతం చింతమనేని రామాండ్ లో ఉంటున్నారు. ఇక్కడ మాజీ మంత్రులు గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇపుడు కేసులు పెడుతున్న వాళ్ళంతా ఒకపుడు చింతమనేని బాధితులే. తమ హయాంలోనే ఫిర్యాదులపై కేసులు పెట్టుంటే ఇపుడు ఇన్ని కేసులుండేవి కావు. అలాగే చింతమనేని కూడా కంట్రోల్లోనే ఉండేవారు. అధికారంలో ఉన్నపుడు విర్రవీగితే ఫలితం ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత అనుభవించక తప్పదని మాజీ మంత్రులు గ్రహించాలి.

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: