చదువుకున్న వారు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు ఎందుకంటే సరైన ప్రయత్నం చేయక. ఒకవేళ చేసిన మొదటిసారే ప్రయత్నం ఫలించదు కదా! ఒక క్రికెట్ మ్యాచ్‌లో ఓవర్‌కు ఆరు బాల్స్ ఉంటాయి. ఒక బాల్ మిస్సైన రెండో బాల్ సిక్స్ కొట్టవఛ్చు. అలా కాకున్న ఆఖరి బాల్‌కైన సిక్స్ కొట్టే అవకాశం ఉంటుంది. కాని కొట్టే దమ్మున్న వాడు ఎప్పుడైనా కొడతాడు. ఇలాగే ఉద్యోగం కావాలనే కసి ఉంటే ఎక్కడైన కష్టపడి సాధిస్తాడు. ఇప్పుడు మీకు ఈ అవకాసం వచ్చింది. మీలో దమ్ము ఉందా.


అయితే ఇలాంటి వారి కోసమే భార‌త ప్రభుత్వ హోంమంత్రిత్వ శాఖ‌ ఆధ్వర్యంలోని సెంట్రల్ ఇండ‌స్ట్రియ‌ల్ సెక్యూరిటీ ఫోర్స్ స్పోర్ట్స్ కోటా కింద హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భ‌ర్తీకి సరైన అర్హతలు ఉన్న స్త్రీ, పురుష అభ్యర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఇందుకు గాను ఇంటర్ అర్హతతో పాటుగా, సంబంధిత క్రీడా విభాగంలో గుర్తింపు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులుగా చెబుతుంది.. ఇక దరఖాస్తులు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవలసి ఉంటుంది.


ఇకపోతే హెడ్ కానిస్టేబుల్‌(జ‌న‌ర‌ల్ డ్యూటీ) 300 పోస్టులు ఉన్నాయి వీటిలో అథ్లెటిక్స్‌ 91. బాక్సింగ్ 11. బాస్కెట్‌బాల్‌ 08. జిమ్నాస్టిక్స్‌ 04. ఫుట్‌బాల్‌ 06. హాకీ 12. హ్యాండ్‌బాల్‌ 09. జూడో 17. క‌బ‌డ్డీ 20. షూటింగ్ 32. స్విమ్మింగ్‌ 14. వాలీబాల్ 08. వెయిట్‌లిఫ్టింగ్‌ 32. రెజ్లింగ్ 20. తైక్వాండో 16 ఈ విభాగాలకు గాను ఉన్న పోస్టుల సంఖ్యలు ఇవి.  ఇకపోతే ఈ ఉద్యోగానికి అర్హత‌ ఇంట‌ర్ ఉత్తీర్ణత కలిగి, సంబంధిత క్రీడ‌లో రాష్ట్రస్థాయిలో గాని, జాతీయ‌స్థాయిలో గాని, అంత‌ర్జాతీయ స్థాయి గుర్తింపు. నిర్దేశిత శారీర‌క ప్రమాణాలు కలిగి ఉండాలి.


ఇక వయస్సు 01.08.2019 నాటికి 18-23 సంవత్సరాల మ‌ధ్య ఉండాలి. దరఖాస్తులు విధానం ఆఫ్‌లైన్‌ ద్వారా ఉంటుండగా, ట‌్రయ‌ల్ టెస్ట్‌, ప్రొఫిషియ‌న్సీ టెస్ట్‌, మెరిట్, మెడిక‌ల్ టెస్ట్ ఆధారంగా  ఎంపిక జరుగుతుంది. ఇకపోతే ఈ ఉద్యోగాలకు 17.12.2019.దరఖాస్తులు చివరి తేది. కాగా నార్త్-ఈస్ట్ రీజియన్ అభ్యర్థులకు  24.12.2019 చివరితేది..


మరింత సమాచారం తెలుసుకోండి: