ఎంఎంటిఎస్ రైళ్ల వేగం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. క్షణాల్లో వేగం అందుకునే శక్తి వీటి సొంతం. ఈ వేగమే ఎంతో మందిని సమయానికి ప్రజల గమ్య స్థలానికి చేర్చింది. ఈ వేగమే కాచిగూడ స్టేషన్ లో జరిగిన రైలు ప్రమాదానికి కారణమైందని చెప్పవచ్చు. సోమవారం జరిగిన రైలు ప్రమాదంలో హంద్రీ ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ ఇంజిన్ మాత్రమే ప్రధాన రైలు నుంచి కాచిగూడలోని నాలుగో ప్లాట్ ఫామ్ మీదికి తిరిగింది. ఈ ఇంజన్ ను ఎంఎంటిఎస్ ఢీ కొట్టడంతో పెను ప్రమాదం తప్పింది. ఇదే వేగంతో బోగీలను ఢీ కొంటె పెను ప్రమాదం సంభవించేదని అధికారులు తెలియచేయడం జరిగింది.


రైల్వే కి 12 కోట్ల నష్టం..!
సోమవారం జరిగిన ప్రమాదంలో 30 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్యాబిన్‌లో చిక్కుకుపోయిన ఎంఎంటీఎస్ లోకోపైలట్‌ 8 గంటలు ప్రాణాలకోసం పోరాడాడు. 8 గంటల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత అతన్ని రక్షించారు. అతడు బయటికి రావడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. అయినా అతని పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. 


ఎంఎంటిఎస్ చరిత్రలో తొలి ప్రమాదమే రైల్వేకి  భారీ నష్టం మిగిల్చింది. దెబ్బ తిన్న బోగీల వల్లే 12 కోట్ల నష్టం వాటిల్లింది. కేవలం ఇది ప్రాథమిక అంచనా మాత్రమే అని అధికారులు తెలిపారు. అయితే  ఎంఎంటీఎస్ 16 ఏళ్ల చరిత్రలో సోమవారం జరిగిన ప్రమాదమే అతి పెద్ద దుర్ఘటన అని అధికారులు తెలిపారు. ఇది జరిగిన మరుసటి రోజే మరో రైలు ప్రమాదం ప్రయాణికులను ఒక్కసారిగా భయానికి గురిచేసింది. బాంగ్లాదేశ్ లో జరిగిన రైలు ప్రమాదంలో 15 మందికి పైగా ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా గాయపడ్డారు. అయితే ఈ రెండు ప్రమాదాలకు వేగంతో పాటు సిగ్నల్ లోపలే కారణం అని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: