మన దేశంలో అతి పెద్ద బ్యాంకైన స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా సంస్థలో మనలో చాలామందికి అకౌంట్స్ ఉన్నాయి. అయితే ఇటీవల కొద్దిరోజులుగా ఆ బ్యాంక్ ద్వారా చేస్తున్న లావాదేవిలకు సరైన సమయంలో ఓటీపీ రాకపోవడంతో కొందరు ఖాతాదారులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాస్తవానికి నేడు ఏ చిన్న లావాదేవీ చేసినా, దానికి సంబంధించి మన మొబైల్ కు వెంటనే అలెర్ట్ రావడం జరుగుతుంది. కానీ ఎక్కువగా sbi ఖాతాదారులు మాకు సకాలంలో ఓటీపీ రావడం లేదని వాపోతున్నారు. అయితే అవువంటి వాటికి చెక్ పెడుతూ, ప్రస్తుతం మనం చప్పుకోబోయే ఈ చిన్న పద్దతుల ద్వారా ఇకపై ఓటీపీ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. దానికి మీరు చేయవలసిన ప్రక్రియను క్రింద తెల్పడం జరిగింది. అదేమిటంటే, 

ముందుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ఆన్లైన్ సైట్ లో మీ అకౌండ్ ఐడి మరియు పాస్ వర్డ్ తో లాగిన్ అవండి. 
ఆ తరువాత, మై అకౌంట్స్ అండ్ ప్రొఫైల్ సెక్షన్‌లోకి వెళ్లాలి.  
హై సెక్యూరిటీ పాస్‌వర్డ్ లింక్‌పై క్లిక్ చేయాలి. 
ఇక్కడ ప్రొఫైల్ పాస్‌వర్డ్ అవసరం అవుతుంది, ఎంటర్ చేయండి. 
తర్వాత కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. 
ఇక్కడ 3 సెక్యూరిటీ ఆప్షన్లు ఉంటాయి. 
వాటిలో ఒక దానిని మీకు నచ్చిన విధంగా సెట్ చేసుకోవచ్చు.   
ఇంటర్ బ్యాంక్ బెనిఫీషియరీ పేమెంట్స్, క్రెడిట్ కార్డు బెనిఫీషియరీ, ఐఎంపీఎస్, ఇంటర్నేషనల్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ వంటి లావాదేవీలకు ఓటీపీ పొందాలంటే ఫస్ట్ ఆప్షన్ యస్ అని పెట్టుకోవాలి.  
అదే మర్చంట్ ట్రాన్సాక్షన్లు నిర్వహిస్తుంటే, వాటికి కూడా ఓటీపీ సెట్ చేసుకోవచ్చు. యస్ అని పెట్టుకుంటే మీరు నిర్వహించే ప్రతి మర్చంట్ ట్రాన్సాక్షన్‌కు ఓటీపీ తప్పనిసరిగా వస్తుంది. 
చివరిగా మూడో ఆప్షన్‌లో ఎస్ఎంఎస్, ఎస్ఎంఎస్ అండ్ మెయిల్, స్టేట్ బ్యాంక్ సెక్యూర్ ఓటీపీ (మొబైల్ యాప్) అనేవి ఉంటాయి. మీరు అందులో ఏదో ఒక ఆప్షన్ ఎంచుకోవచ్చు, అలా ఎంచుకున్న దాని ప్రకారం ఇక పై ప్రతి ట్రాన్సక్షన్ కు ఓటీపీ రావడం జరుగుతుంది.....!!

సో, ఈ విధంగా చేసి ఇకపై ఓటీపీ రాకపోవడం వంటి సమస్యల నుండి విముక్తి పొందండి....!!


మరింత సమాచారం తెలుసుకోండి: