భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయి ఈ నెల 17వ తేదీన పదవీవిరమణ చేయనున్నారు. సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం 2018 సంవత్సరం సెప్టెంబర్ నెలలో అయ్యప్ప ఆలయంలోకి 10 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలలోపు మహిళలకు ప్రవేశం కల్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. సుప్రీం కోర్టు జోక్యాన్ని శబరిమల అంశంలో సవాలు చేస్తూ 65 పిటిషన్లు దాఖలయ్యాయి. 
 
రేపు ఉదయం 10.30 గంటలకు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ రోహిటన్ నారిమన్, జస్టిస్ ఇందూ మల్హోత్రా, ఏఎం ఖన్విల్వర్ తో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించనుంది. ప్రభుత్వం  సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో కేరళ రాష్ట్రంలో భారీగా భద్రత ఏర్పాట్లు చేసింది. అయోధ్యలోని రామజన్మభూమి - బాబ్రీమసీదు వివాదం తరువాత ప్రస్తుతం అందరి దృష్టి శబరిమలపై నిలిచింది. 
 
శబరిమలలో ఈ నెల 17వ తేదీ నుండి మకరవికళ్లు ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. సుప్రీంకోర్టు దాఖలైన 65 పిటీషన్లను ఒక కేసుగా మలిచి ఈ పిటీషన్లపై విచారణ పూర్తి చేసింది. కేరళ డీజీపీ 24గంటలపాటు పోలీసు బందోబస్తు ఉంటుందని ఇప్పటికే స్పష్టం చేశారు. గత సంవత్సరం సుప్రీంకోర్టు తీర్పు తరువాత చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే మహిళలు దర్శనం చేసుకున్నారు. 
 
గత సంవత్సరం సుప్రీంకోర్టు తీర్పు తరువాత మలయాళీ మహిళలు నీలక్కల్ నుండి సన్నిధానం వరకు రోడ్డుకు ఇరువైపులా నిల్చుని స్వామివారి దర్శనానికి మహిళలు వెళ్లకుండా అడ్డుకోగలిగారు. రేపు సుప్రీం కోర్టు తీర్పు వెలువడనున్న నేపథ్యంలో 24 మంది పోలీస్ సూపరిండెంట్లు, 264 మంది ఇన్ స్పెక్టర్లు, 1185 మంది సబ్ ఇన్ స్పెక్టర్లు, 8402 మంది పోలీస్ అధికారులను ప్రభుత్వం మోహరించింది. కేరళ మంత్రి సురేంద్రన్ రామజన్మభూమి - బాబ్రీ మసీదు కేసులో సుప్రీం తీర్పును ఆహ్వానించినట్లే అయ్యప్పస్వామి ఆలయంలోకి మహిళలను అనుమతించే అంశంలో సుప్రీం తీర్పును బీజేపీ గౌరవించాలని కోరారు. 


 



మరింత సమాచారం తెలుసుకోండి: