ఆర్టీసీ కార్మికులు గత 40  రోజులుగా చేస్తోన్న  సమ్మె పరిష్కారానికి ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి లతో  అత్యున్నతస్థాయి  కమిటీ ఏర్పాటు చేస్తామని  హైకోర్టు పేర్కొంది . మాజీ న్యాయమూర్తులతో అత్యున్నతస్థాయి కమిటీ ఏర్పాటు పై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని బుధవారం లోగా తెలియజేయాలని అడ్వకెట్ జెనరల్ ను ఆదేశించింది . హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేస్తూ ,  హైపవర్ కమిటీ ఏర్పాటు ను వ్యతిరేకించింది. 


 1947 ఇండస్ట్రియల్ డిప్యూటీ యాక్ట్ (పారిశ్రామిక వివాదాల పరిష్కార చట్టం) ప్రకారం కార్మికులంతా కంపెనీ నిబంధనలకు లోబడి పనిచేయాలని కానీ ఆర్టీసీ కార్మికులు ఏ  చట్టాలను పట్టించుకోవడం లేదని ప్రభుత్వం తన అఫిడవిట్ లో  పేర్కొంది.  ఇండస్ట్రియల్ డిప్యూటీ యాక్ట్ సెక్షన్ 10   ప్రకారం లేబర్  కమీషన్ కు ఈ సమ్మె విషయమై  ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వం , హైకోర్టును కోరింది . ఆర్టీసీ కార్మికుల సమ్మె లేబర్ కోర్టు పరిధిలో ఉందంటూ ప్రభుత్వం కోర్టు దృష్టికి తీసుకువచ్చింది . ముగ్గురు మాజీ న్యాయమూర్తులతో అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామంటూ హైకోర్టు చేసిన వ్యాఖ్యలను ఆర్టీసీ జెఎసి నేతలు స్వాగతించారు .


ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గత నెల ఐదవ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మె కొనసాగిస్తున్న విషయం తెల్సిందే . సమ్మె వల్ల సామాన్య ప్రజానీకం ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని హైకోర్టు అటు ప్రభుత్వానికి , ఇటు కార్మికులకు సూచించింది . అయితే కార్మికులను చర్చలకు ప్రభుత్వం ఆహ్వానించకపోవడం పట్ల హైకోర్టు ప్రభుత్రం పై సీరియస్ అయింది .  సమస్యను పరిష్కరించే దిశగా అత్యున్నత కమిటీ ఏర్పాటు చేయాలనీ నిర్ణయించింది . అయితే ప్రభుత్వం ఈ కమిటీ ఏర్పాటుకు అంగీకరించక పోవడంతో   , హైకోర్టు ఏమి నిర్ణయం తీసుకుంటున్నది ఆసక్తికరంగా మారింది .


మరింత సమాచారం తెలుసుకోండి: