గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో 2017 సంవత్సరంలో అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా స్టార్టప్  ప్రాంత అభివృద్ధి కోసం సింగపూర్ కన్సార్టియం తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని తాజాగా వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. స్టార్టప్ ప్రాజెక్టుల్లో కొన్ని సమస్యలు తలెత్తడం వల్ల సింగపూర్ కన్సార్షియం స్టార్టప్  ప్రాజెక్టు నుంచి తప్పుకోవాలని ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ మేరకు స్టార్టప్  ప్రాజెక్ట్ నుంచి సింగపూర్ కన్సార్షియం తప్పుకుంటున్నట్లు సింగపూర్ మంత్రి ఈశ్వరన్  తెలిపారు . తాజాగా ఈ అంశం పై స్పందించిన టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. సింగపూర్ కన్సార్షియం ఎంవోయూ రద్దు చేశారని ఆరోపించిన చంద్రబాబు ఏపీ అభివృద్ధికి ఇది ఊహించని శరాఘాతమే అన్నారు. 

 

 

 

 ఇక ఇసుక సమస్యపై రేపు దీక్ష చేపట్టిన నేపథ్యంలో ఈరోజు చంద్రబాబు టిడిపి నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. భవన నిర్మాణ రంగ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం దీక్ష చేపడుతున్నానని పార్టీ నేతలు కార్యకర్తలు అందరూ విజయవంతం చేయాలని సూచించారు. ఇక ఐదు నెలల్లో 50 మంది కార్మికులు ఆత్మహత్యలు జరగడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేదని చంద్రబాబు విమర్శలు గుప్పించారు. అసలు ఇసుక కొరత ఏర్పడడానికి వైసీపీ ప్రభుత్వమే కారణమని వైసీపీ ప్రవేశపెట్టిన నూతన ఇసుక విధానం వల్లే రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడిందని విమర్శలు గుప్పించారు.

 

 

 

 ఇక  రాష్ట్రంలో కృత్రిమ ఇసుక కోరుతను  వైసీపీ నేతle సృష్టించారని చంద్రబాబు ఆరోపించారు. జగన్ సర్కార్ తీరుపై రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదని పోలవరం ప్రాజెక్టు పనులను కూడా నిలిపివేశారు అంటూ చంద్రబాబు విమర్శలు గుప్పించారు. జగన్ సర్కార్ తీరుతో రాష్ట్రానికి  తీరని నష్టం జరుగుతుందన్న చంద్రబాబు....రాష్ట్ర  భవిష్యత్తును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  అంధకారంలోకి నెట్టుతూన్నారని అన్నారు. జగన్ ఇష్టానుసారంగా నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తున్నారని  విమర్శించిన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాకంటక పార్టీ వైసీపీ మారిందని తెలిపారు. ప్రజలతో మమేకమై రాష్ట్రంలో  ఏర్పడిన సమస్యల పరిష్కారానికి పోరాడుతామని చంద్రబాబు స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: