సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినేట్ ముగిసింది. ఏపీ కేబినేట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక పై ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే రెండేళ్ల జైలు శిక్ష, రూ.2 లక్షల రూపాయల జరిమానా విధించేలా కేబినేట్ సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏపీ కేబినేట్ తీసుకున్న నిర్ణయాలు ఈ విధంగా ఉన్నాయి. 


ఇసుక అక్రమ రవాణా చట్టం సవరణకు కేబినేట్ ఆమోదం. ఇసుక అక్రమ రవాణా చేసినా నిల్వ ఉంచినా నేరమే. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే రెండేళ్ల జైలు శిక్ష, రెండు లక్షల రూపాయల జరిమానా.  ఇంగ్లీషు మీడియం బోధనకు ఆమోదం. 1నుంచి 6 వ తరగతి వరకు ఇంగ్లీషు మీడియం బోధన. తెలుగు లేదా ఉర్దూ సబ్జెక్టు తప్పనిసరి సబ్జెక్టుగా ఉంటాయి. ఇంగ్లీషు మీడియం అమలు పై ప్రత్యేక అధికారిగా ఐఏఎస్ వట్రీ సెల్వీ నియామకం.  


మొక్కజొన్న మద్దతు ధరకు చర్యలు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు తెరవాలని నిర్ణయం. నేడే విజయనగరం, కర్నూలు జిల్లాలో కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారంభం అయ్యాయి.   మార్కెట్ కమిటీలు, ఆలయ పాలక మండళ్ల భర్తీకి సీఎం జగన్ ఆమోదం. ఈ నెలాఖరుకు భర్తీ చేయాలని ఆదేశం.  పాలక మండళ్లలో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి. వీటి భర్తీ, రిజర్వేషన్ల బాధ్యతలను ఇంఛార్జీ మంత్రులకు అప్పగింత. 


అక్రమ లే ఔట్ల క్రమబద్దీకరణకు ఆమోదం. ఏపీ పర్యావరణ మేనేజ్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం.  వైఎస్సార్ మత్స్యకార భరోసాకు ఆమోదం. మత్య్సకారులు ప్రమాదవశాత్తు చనిపోతే రూ. 10 లక్షల ఆర్ధిక సహాయం అందజేత. సోలార్, పవన విద్యుత్ పాలసీలకు సవరణలు.  గ్రామ న్యాయాలయాల ఏర్పాటుకు కేబినేట్ ఆమోదం తెలిపింది.యవాదుల సంక్షేమ నిధికి చట్ట సవరణ. ఫైర్ డైరెక్టర్, 9 అసిస్టెంట్ డైరెక్టర్ల నియామకానికి ఆమోదం తెలిపింది .  8 ఆలయాలకు ట్రస్టు బోర్డుల ఏర్పాటకు గ్రీన్ సిగ్నల్ .


మరింత సమాచారం తెలుసుకోండి: