అ అంటే అమ్మ, ఆ అంటే ఆవు. ఇది తెలుగు బడులలో నేర్పిన తొలి పాఠాలు. మరి మన రాజకీయ నాయకులకు ఎప్పటికపుడు పాఠాలు, పుస్తకాలు మారిపోతూంటాయి. ఎప్పటికి ఏది  అవసరమో దాన్ని పట్టుకుని సయ్యాట ఆడడమే ఈనాటి రాజకీయం. ఏపీ రాజకీయాల్లో ఇపుడు సమస్యలు లేవా. ఉంటే ఆ సమస్యలు ఏంటి. వైసీపీ సర్కార్ పెద్దలు అయితే చక్కంగా సాఫీగా పాలన సాగుతోందని చెబుతోంది.


మరి ప్రతిపక్షాలు కూడా దాదాపుగా దాంతో ఏకీభవిస్తున్నట్లుగానే సీన్ చూస్తే అనిపిస్తోంది. ఏపీలో ఆరు నెలలల్లో మంచి ముఖ్యమంత్రిని అనిపించుకుంటానని చెప్పిన జగన్ ఎన్ని మార్కులు సాధించారో తెలియదు కానీ ప్రతిపక్షాలకు సమస్యలు ఎక్కువగా లేకుడా చేయడంతో మాత్రం విజయం సాధించారనే అంటున్నారు.ఏపీలో ఇసుక కొరత అన్న ఇష్యూనే ఇప్పటికీ ప్రతిపక్షాలు పట్టుకుని పీకి పాకం చేస్తున్నాయి. ఇసుక సమస్య పేరిట మూడు నెలల నుంచి విపక్షం రోడ్డు మీదే ఉంది. అందరూ తలోరకంగా ఆందోళను చేస్తున్నారు. అయినా అనుకున్న మైలేజ్ ఎవరికీ దక్కడంలేదు. చంద్రబాబు ఈ విషయంలో బాగా ఆందోళన చెందుతున్నారు. దాంతో ఆయన రేపు విజయవాడలో  ఇసుక దీక్ష చేయబోతున్నారు. దీనికి జాతీయ మీడియాను సైతం పిలిపించుకుని హడావుడి మొదలెట్టేస్తున్నారు. ఇక మరో వైపు వరదలు తగ్గి ఇసుక సరఫగా బాగా పెరిగిందని వైసీపీ సర్కార్ చెబుతోంది. దాంతో రేపటి నుంచి ఇసుక వారోత్సవాలకు సర్కార్ తెరతీసింది.


ఇవన్నీ ఇలా ఉంటే వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ బడులలో ఇంగ్లీష్  మాధ్యమంలో విద్యను బోధించాలని సర్కార్ తీసుకున్న నిర్ణయం కూడా ఇపుడు విపక్షాలకు అస్త్రమైపోయింది. దాంతో ఇంగ్లీస్ అంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ లాంటి వారు ప్రతీ రోజూ విమర్శలు చేస్తున్నరు. ఈ రోజు కూడా  పవన్ విశాలాంధ్ర బుక్ హౌస్ లొ పుస్తకాలు కొనుక్కోవడానికి వచ్చినపుడు జగన్ సర్కార్ మీద దుమ్మెత్తి పోశారు. మట్టిలో కొట్టుకుపోతారని కూడా ఆయన ద్వజమెత్తారు.  అంటే ఇపుడు ఇసుక, ఇంగ్లీష్ ఈ రెండు మాత్రమే విపక్షాలకు ఏకైక‌ సమస్యలుగా ఉన్నాయీ అంటే అక్కడివరకూ జగన్ సక్సెస్ అయినట్లే కదా.


మరింత సమాచారం తెలుసుకోండి: