కేంద్ర ప్రభుత్వం వాహనదారులు టోల్ గేట్ల దగ్గర గంటలు గంటలు ఎదురుచూసే విధానానికి స్వస్తి పలికేలా ఫాస్టాగ్ విధానాన్ని తీసుకురాబోతుంది. ఈ ఫాస్టాగ్ విధానం ద్వారా వాహనదారులు టోల్ గేట్ల దగ్గర వాహనాలను ఆపాల్సిన అవసరం లేదు. గుర్తింపు పొందిన బ్యాంకుల్లో మరియు టోల్ ప్లాజా దగ్గర ఫాస్టాగ్ స్టిక్కర్లు లభించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
సాధారణంగా వాహనదారులు టోల్ ప్లాజా దాటటానికి పది నిమిషాల నుండి అరగంట సమయం పడుతుంది. వాహనదారుల దగ్గర తగిన చిల్లర లేకపోవడం, నగదు రూపంలో వాహనదారులు టోల్ రుసుములను చెల్లించటం వలన టోల్ గేట్ల దగ్గర వాహనదారులు ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తుంది. కొన్ని టోల్ ప్లాజాల దగ్గర మాత్రమే ఆన్ లైన్ లో టోల్ రుసుము చెల్లించే విధానం అందుబాటులో ఉంది. 
 
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు మై ఫాస్టాగ్ ఫాస్టాగ్ పార్ట్ నర్ పేరుతో యాప్ ను అందుబాటులోకి తెచ్చారు. ఈ యాప్ ను వాహనదారులు బ్యాంక్ ఖాతాతో అనుసంధానం చేసుకోవాలి. ఆ తరువాత బ్యాంకులు లేదా టోల్ ప్లాజాల్లో నిర్ణీత రుసుము చెల్లించి ఫాస్టాగ్ పేరుతో పాటు బార్ కోడ్ తో ఉన్న స్టిక్కర్ ను వాహనం ముందుభాగంలోని అద్దంపై అతికించాలి. 
 
టోల్ ప్లాజా సిబ్బంది ఈ నూతన విధానం వలన చిల్లర సమస్యలు ఉండవని సమయం ఆదా అవుతుందని చెబుతున్నారు. నెలవారీ పాస్ లు ఉన్న వాహనాలు, వీఐపీల వాహనాలను ముందుగానే స్కాన్ చేసి ఉంచటంతో వాహనాల నంబర్లు స్కాన్ అయి గేట్లు తెరుచుకుంటాయి. ఫాస్టాగ్ కు అనుసంధానించిన బ్యాంకు ఖాతా ద్వారా రుసుము చెల్లించటంతో పాటు రీచార్జ్ చేసుకునే విధానం కూడా అందుబాటులో ఉంది. ఈ విధానం వాహనదారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పవచ్చు, 




మరింత సమాచారం తెలుసుకోండి: