లోకంలో అక్రమ సంబందాల వల్ల ఎన్ని ప్రాణాలు పోతున్నాయో లెక్కే లేదు. అయినా కాని మనుషుల్లో కాస్త కూడా మార్పు కనిపించడం లేదు. మూడు నాలుగు నిమిషాల సుఖం కోసం మూడు ముళ్ల బందాన్ని నవ్వులపాలు చేస్తున్నారు. కట్టుకున్న వాడితో దక్కని సుఖం, రంకు మొగుడితో దక్కించుకోవాలని ఆరాట పడుతూ, ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ కాలంలో మనిషి సెక్స్ కోసమే జీవిస్తున్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. నలుగురి మధ్యలో అగ్ని సాక్షిగా అక్షింతలు వేసిన మొగుళ్లను, భార్యలు చంపుతుంటే, దైవం సాక్షిగా కట్టిన తాళికి విలువ ఇవ్వకుండా మగాడు ప్రవర్తిస్తున్నాడు.


ఇదేనా మహానుభావులు కలలుకన్న భారతదేశం అని అనిపిస్తుంది ఇప్పుడు జరుగుతున్న అరాచకాలను చూస్తుంటే. ఇకపోతే ఓ మహిళ ప్రియుడి పుట్టినరోజు సందర్భంగా అతడికి సర్‌ప్రైజ్ ఇద్దామనుకుని ప్లాన్ చేసింది. అందు కోసం ఓ హోటల్‌లో రూమ్ కూడా బుక్ చేసి అన్ని ఏర్పాట్లు చేసింది. కానీ ప్లాన్ బెడిసికొట్టి అతడి చేతిలోనే ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయానికి సంబంధించిన వివరాలు తెలుసుకుంటే.


ఢిల్లీకి చెందిన ఓ మహిళకు ఇదివరకే పెళ్లై ఇద్దరు పిల్లలున్నారు. సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమెకు విక్కీమన్ అనే యువకుడితో కొద్దినెలల క్రితం పరిచయం ఏర్పడింది. అదికాస్తా అక్రమ సంబంధానికి దారితీసింది. వీలు చిక్కినప్పుడల్లా ఇద్దరూ హోటళ్లు, లాడ్జిల్లో రూమ్‌లు తీసుకుని రాసలీలలు కొనసాగించేవారు. సోమవారం విక్కీమన్ పుట్టినరోజు కావడంతో సెలబ్రేట్ చేసుకునేందుకు ఆ మహిళ అలీపూర్‌లోని ఓ హోటల్‌లో రూమ్ బుక్ చేసింది . రాత్రి ఇద్దరూ రూమ్‌కి వెళ్లి కాసేపు రొమాన్స్ చేసుకున్న తర్వాత ఓ చిన్న వివాదం కారణంగా ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది.


ఈ క్రమంలో ఆమె ప్రియుడు ఆవేశం ఆపుకోలేక  ప్రియురాలిని కత్తితో పొడిచాడు. తీవ్ర రక్తస్రావంతో ఆ మహిళ అక్కడికక్కడే కుప్పకూలిపోవడంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఆతర్వాత ఉదయం హోటల్ సిబ్బంది ఆ రూం తలుపు కొట్టగా ఎవరూ తీయకపోవడంతో మారుతాళంతో తలుపు తెరిచి, రక్తపుమడుగులో ఉన్న మహిళను చూసిన వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.


దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని బాధితురాలిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టి, మహిళ కుటుంబసభ్యులకు సమాచారమిచ్చి వివరాలు సేకరించారు. ఇకపోతే ఆ హోటల్‌ సిబ్బంది ఈ జంట గత ఐదు నెలల్లో ఆరేడు సార్లు వచ్చినట్లు తెలిపారు. మరణించిన ఆమె ఆత్మ ఇప్పుడు అనుకుంటుంది చాటుమాటు రొమాన్స్ చివరికి ఎంత పని చేసిందని..

మరింత సమాచారం తెలుసుకోండి: