ఖమ్మం జిల్లాలోని మర్లపాడులో షేక్ మదార్ ముఠా కొత్త నోట్లకు పాత నోట్లు అంటూ మోసాలకు పాల్పడుతోంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలానికి చెందిన కొందరు వ్యక్తులు ఫైనాన్స్ వ్యాపారం పేరుతో ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఆ తరువాత అమాయకుల్ని టార్గెట్ చేసి లక్ష రూపాయల కొత్త నోట్లు ఇస్తే 5 లక్షల రూపాయలు పాత నోట్లు ఇస్తానని నమ్మించేవారు. పాత నోట్లను ఆర్బీఐలో మార్చుకోవచ్చని చెప్పి టార్గెట్ చేసిన వాళ్లను నమ్మించేవారు. 
 
టార్గెట్ చేసిన వాళ్లకు నమ్మకం కుదిరేలా కంటెయినర్ తరహాలో 500, 1000 రూపాయల పాత నోట్లను అమర్చి ఆ నోట్ల కట్టలను వీడియో తీసి షేక్ మదార్ ముఠా మోసాలకు పాల్పడేది. గతంలో మదార్ పై వేంసూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కావటంతో పాటు మదార్ ఒక సంవత్సరం జైలు శిక్షను కూడా అనుభవించాడు. ఇదే విధంగా మదార్ ముఠా రైతుల్ని కూడా మోసం చేసిందని తెలుస్తోంది. 
 
5 లక్షల రూపాయలు మరియు భూమి పాస్ పుస్తకం జిరాక్స్ ఇస్తే 40 లక్షల రూపాయల వరకు పంటరుణం ఇస్తానని ఈ ముఠా నమ్మించేది. రైతులు 5 లక్షల రూపాయలతో పాటు పాస్ బుక్ జిరాక్స్ ఇచ్చిన తరువాత ఈ ముఠా అడ్రస్ మార్చి మోసాలకు పాల్పడేది. ఈ ముఠా ఇదే విధంగా కొంతమంది రైతుల్ని మోసం చేసినట్లు తెలుస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలో ఇలాంటి మోసం ఒకటి వెలుగులోకి వచ్చింది. 
 
28 లక్షల రూపాయలు ఇస్తే కోటి రూపాయలు ఇస్తామని నమ్మించి ప్రసాద్ అనే వ్యక్తిని మోసం చేశారు. మోసపోయిన బాధితుడు పోలీసులను ఆశ్రయించటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మదార్ ముఠాకు చెందిన కొందరు వ్యక్తులు ప్రసాద్ ను మోసం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆర్బీఐ ఎస్బీఎన్ యాక్ట్ కింద నిందితుల్ని అరెస్ట్ చేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: