జనాలు ఊరికే అనరు నారా లోకేష్ ను పప్పూ అని. ఏ ముహూర్తంలో ఆ పేరు బయటకు వచ్చిందో కానీ నిజంగానే తాను పప్పూని అనిపించుకుంటున్నారు లోకేష్. ఇంతకీ విషయం ఏమిటంటే వైసిపిలో ఇసుకాసురులు అంటూ తెలుగుదేశంపార్టీ అధికార పార్టీకి చెందిన 68  మంది పేర్లను తయారు  చేసింది. ఇందులో మంత్రులున్నారు. స్పీకర్ కొడుకు తమ్మినేని సీతారామ్ కొడుకూ ఉన్నాడు. ఎంఎల్ఏలు, నేతలు, మంత్రుల బంధువుల పేర్లు కూడా ఉన్నాయి.

 

ఇక్కడ విషయం ఏమిటంటే ఆరోపణలు చేస్తోంది టిడిపి నేతలు. ఇసుకాసురులు అంటూ వైసిపి నేతల పేర్లతో జాబితా తయారు చేసిందీ టిడిపినే. దాన్ని విడుదల చేసింది చంద్రబాబునాయుడు. ఆ జాబితాను పట్టుకుని లోకేష్ ట్విట్టర్లో ఓ ట్వీట్ పెట్టేశారు. ఇంతకీ ఆ ట్వీట్ ఏమిటయ్యా అంటే అడ్డంగా దొరికేసిన వైసిపి ఇసుకాసురులు అని.

 

ఇసుకాసురుల లీలలు బయటపడ్డాయట. వైకాపా ఇసుక దొంగలు దొరికాపోయారట. లోకేష్ ట్వీట్ కు ఏమన్నా అర్ధముందా ?  లీలలు బయటపడ్డాయని...లేకపోతే అడ్డంగా దొరికిపోయారనే పదాలు ఎప్పుడు వాడుతారో కూడా లోకేష్ కు తెలిసినట్లు లేదు. వైసిపి నేతలు ఎవరైనా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నపుడు పోలీసులు లేకపోతే ప్రభుత్వ యంత్రాంగానికి కానీ అదీకాకపోతే జనాలకు కాని సాక్ష్యాలతో సహా పట్టుబడినపుడు అడ్డంగా దొరికిపోయారనో లీలలు బయటపడ్డాయనో చెబితే అర్ధముంటుంది.

 

అలా కాకుండా వాళ్ళ పార్టీ ఆఫీసులో ఓ పదిమంది లీడర్లు  కూర్చుని జిల్లాల వారీగా కొందరు వైసిపి నేతల పేర్లను గుర్తుకు తెచ్చుకుని ఆ పేర్లతో ఓ జాబితాను రెడీ చేస్తే సరిపోతుందా ? ఆ జాబితాకు మళ్ళీ చార్జిషీటనే పేరొకటి. దానికి లోకేష్ తన ట్విట్టర్ ద్వారా బురదచల్లుతూ ప్రచారం మళ్ళీ. ఇందుకే లోకేష్ ను అందరూ పప్పూ అని అంటున్నారు. కాస్త బుర్రపెట్టి కూడా ఆలోచించకుండా ఉత్త ట్విట్టర్ ద్వారా ఆరోపణలు చేస్తు, బురదచల్లే కార్యక్రమాలు చేస్తే సరిపోతుందని లోకేష్ అనుకుంటున్నట్లున్నారు.

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: