అయోధ్య స్థలం మొత్తం  రామమందిరానికే చెందుతుందనీ.. ఇది రామజన్మ భూమేనన్న పక్కా ఆధారాలు ఉన్నట్లు ఇటీవల వివాస్పద అయోధ్య స్థలానికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. రామమందిరానికి వెంటనే ట్రస్టు ఏర్పాటు చేయాలని  ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. దీంతో, కేంద్ర ప్రభుత్వం అయోధ్య ట్రస్టు ఏర్పాటుకు కసరత్తులు చేస్తోంది. 


పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ఈ నెల 18 నుంచి ప్రారంభమవుతాయి. వచ్చే పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో అయోధ్య ట్రస్టు బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుంది. ఇందులో భాగంగా ట్రస్టు ఏర్పాటుకు సంబంధించిన చర్యలు కేంద్రం  ప్రారంభించినట్లు తెలుస్తోంది. అన్ని ర‌కాలైన సాంకేతి, న్యాయ‌సంబంధ‌మైన అంశాల‌ను ప‌రిశీలించి త‌గు రీతిలో ముందుకు సాగే ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు స‌మాచారం. 


కాగా, సున్నీ వక్ఫ్‌బోర్డుకు అయోధ్యలోనే 5 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని సుప్రీం తెలిపిన విషయం తెలిసిందే. అయితే, అయోధ్యలో మసీదు నిర్మాణం కోసం ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న 67 ఎకరాల్లోనుంచే 5 ఎకరాలివ్వాలని బాబ్రీ మసీదు- రామ జన్మభూమి కేసులో లిటిగెంట్‌ ఇఖ్బాల్‌ అన్సారీ తో సహా పలువురు స్థానిక ముస్లిం నేతలు డిమాండ్‌ చేశారు. అయోధ్యలో వివాదాస్పద స్థలాన్నికేంద్ర ప్రభుత్వం 1991లో స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు అయోధ్య వివాదంపై తీర్పు చెబుతూ ముస్లింలకు మసీదు నిర్మాణం కోసం 5 ఎకరాలను ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. దీంతో ఒకవేళ తమకు భూమి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తే.. తాము కోరిన దగ్గరే కేటాయించాలన్నారు ఇఖ్బాల్‌ అన్సారీ. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న 67 ఎకరాల్లోనుంచే తమకు 5 ఎకరాలు ఇస్తేనే తీసుకుంటామని లేకపోతే తాము ఈ ప్రతిపాదనను అంగీకరించబోమని స్పష్టం చేశారు. బయటకు వెళ్లండి… అక్కడే మసీదు నిర్మించుకోండి అనడం సరైంది కాదని అన్సారీ అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: