చంద్రబాబునాయుడుకు ఎల్లోమీడియాకు రాష్ట్రంలో ఏదో ఓ సమస్య కంటిన్యు అవ్వాలని కోరుకుంటున్నట్లే ఉంది. మొన్నటి ఎన్నికల్లో వైసిపి చేతిలో చావుదెబ్బ తిన్న చంద్రబాబు, ఎల్లోమీడియా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా జీర్ణించుకోలేకపోతున్న విషయం తెలిసిపోతోంది. అందుకనే ప్రతి చిన్న విషయాన్ని బూతద్దంలో చూపిస్తు పెద్దదిగా చిత్రీకరిస్తోంది.

 

తాజాగా తెలుగు మీడియం గొడవ ఇలాంటిదే. ఇసుక కొరత సమస్యను చాలా పెద్దదిగా చిత్రీకరించి దాదాపు నెలన్నరగా నానా యాగీ చేస్తున్నారు. వరదలు, వర్షాల వల్ల ఇసుకను తవ్వి తీయలేకపోవటంతో సమస్య మొదలైన మాట వాస్తవమే.  మొత్తం 270 రీచులలో పదిరోజుల క్రితం వరకూ 65 రీచుల నుండి ఇసుకను తవ్వి తీయగిలిగారు.

 

అయితే వరదలు, వర్షాలు తగ్గుముఖం పట్టడంతో గడచిన పది రోజులుగా ఇసుక తవ్వకాలు మొదలై సరఫరా కూడా మెరుగైంది. ఒకపుడు 30 వేల టన్నుల ఇసుకను సరఫరా చేయగలిగిన ప్రభుత్వం ఇపుడు సుమారు లక్ష టన్నులు సరఫరా చేస్తోంది. తొందరలో 2 లక్షల టన్నుల ఇసుకను సరఫరా చేయాలని జగన్ ఆదేశించారు.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రాష్ట్రంలో ఇపుడు ఇసుక సమస్య అన్నది దాదాపు లేదనే చెప్పాలి. ఈ నేపధ్యంలోనే చంద్రబాబు 14వ తేదీన దీక్ష చేయాలని డిసైడ్ అవ్వటమే విచిత్రం.  ఇపుడు ఇసుక సమస్య పోయింది కాబట్టి వెంటనే స్కూళ్ళల్లో తెలుగు మీడియం సమస్యను భుజానికెత్తుకున్నాయి.

 

చంద్రబాబు ఆయనకు మద్దతుగా నిలబడే ఎల్లోమీడియా వరస చూస్తుంటే రాష్ట్రంలో ఏదో ఓ సమస్య రావణకాష్టం లాగ కాలుతుండాలి అన్నట్లుంది. కొద్దిరోజుల పోలవరం రివర్స్ టెండర్లు, తర్వాత విద్యుత్ రంగంలో పిపిఏలు, ఆ తర్వాత టిడిపి వాళ్ళపై తప్పుడు కేసులు,  అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ అవినీతి వ్యవహారాలు, ఆత్మహత్య ఘటన ఇలా...ఏదో ఓ విషయాన్ని పట్టుకోవటం నానా యాగీ చేయటంతో చంద్రబాబు అండ్ కో తో పాటు ఎల్లోమీడయా కూడా పబ్బం గడుపుకుంటోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: