ఆర్టీసీ.. ప్రజారవాణా సంస్థ... ఇప్పుడు చిక్కుల్లో పడింది.  ప్రగతి రథం పరుగులు తీస్తేనే ప్రజలు రవాణా బాగుపడుతుంది.  కానీ,ఇప్పుడు తెలంగాణాలో ఏం జరుగుతుందో.. ఎం చేయబోతున్నారో ఎలా చేస్తున్నారో అసలు ఏం చేయాలనీ అనుకుంటున్నారో ఎవరికీ అర్ధం కావడం  లేదు.  ఎదో చేయాలి అనుకోని చివరకు ఎదో జరిగి అది మరికొన్ని ఉద్యమాలకు దారితీస్తుందేమో అనిపిస్తోంది.  


26 డిమాండ్లు.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం.  ఈ విలీనం మాట పక్కన పెడితే.. కనీసం 26 డిమాండ్ల విషయంపై కనీసం ప్రభుత్వం చర్చలకు పిలిస్తే కొంతమేర  ఉపయోగం ఉంటుంది కదా.  కాస్త ఆర్టీసీ కార్మికులు శాంతించేవారు కదా.  శాంతించి మంచిగా అనుకున్నట్టుగా ఆర్టీసీ నడుస్తుండేది కదా.  అవేమి  చేయకుండా మాకు నచ్చిందే చేసుకుంటూ పోతాం.  నచ్చనిది ఎవరు చెప్పినా పట్టించుకోము అన్నట్టుగా పీలవుతున్నారు.  దీంతో ఎందుకు వచ్చిన గొడవలే అని చెప్పి సైలెంట్ గా పక్కన ఉండిపోతున్నారు


గత 40 రోజులుగా ఇదే తంతు.. ఇలానే జరుగుతున్నది.  ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు.  సెప్టెంబర్ జీతాలు పాపం వాళ్లకు అందలేదు.  జీతాలు రాకపోగా ఉద్యోగాల్లోనుంచి బయటకు వచ్చి 40 రోజులైంది.  ప్రభుత్వం దిగిరాడు.. కార్మికులు పట్టు వదలరు.  కోర్టు చెప్పినా ప్రభుత్వం వినడం లేదు.  కోర్టు మాటను కూడా ప్రభుత్వం పక్కన పెట్టాలని చూస్తున్నది.  


ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే విషయంలో ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది.  కోర్టు చెప్పే వరకు ఆగాలని కోర్టు అంటోంది.  అవసరం లేదని ప్రభుత్వం చెప్తున్నది.  ముగ్గురు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేసి దీనిపై నివేదిక ఇప్పించాలని అంటే దానికి ప్రభుత్వం ఒప్పుడుకోవడం లేదు.  న్యాయకమిటీ వేస్తె.. తాము సమ్మె విరమించే విషయంలో ఆలోచిస్తామని చెప్తోంది. ఇప్పుడు ఆర్టీసీ పరిస్థితి ఎవరికీ వారే యమునా తీరే అన్న చందాన మారిపోయింది.  మరిప్పుడు ఆర్టీసీ పరిస్థితి ఏంటో ఆ దేవుడికే తెలియాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: