ఒక నిర్ణయం తీసుకుంటే....దానిని తూచా తప్పకుండా అమలు చేయడం ఒక్క సీఎం జగన్ కే సాధ్యమని చెప్పొచ్చు. ఈ ఐదు నెలల పరిపాలన కాలంలో జగన్ అదే చేశారు కూడా. తాను తీసుకునే నిర్ణయాలపై ప్రతిపక్షాలు విమర్శలు చేసినా, ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా అమలు చేస్తూ వచ్చారు. అయితే మొదట్లో పలు నిర్ణయాలపై విమర్శలు చేసిన ప్రతిపక్షాలు వాటి ఫలితాలు రావడం మొదలైన దగ్గర నుంచి విమర్శించడం తగ్గించేశారు.


ఉదాహరణకు పోలవరంతో సహ పలు ప్రాజెక్టుల్లో రివర్స్ టెండరింగ్ కు వెళితే టీడీపీ, బీజేపీ జగన్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశాయి. కానీ అదే రివర్స్ టెండరింగ్ విజయవంతంగా అమలు చేసి వందల కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేశాక ప్రతిపక్షాలు గొంతులు మూగబోయాయి. అలాగే గత టీడీపీ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందని అమరావతి నిర్మాణం కూడా ఆపేశారు. దీనిపై కూడా ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తూనే ఉన్నాయి.


కానీ రాజధాని అంశం 13 జిల్లాల ప్రజలకు చెందినది అని చెప్పి, ఓ కమిటీ ఏర్పాటు చేసి అన్ని జిల్లాల ప్రజల అభిప్రాయం తీసుకుంటున్నారు. ఈ విషయంలో కూడా జగన్ పట్ల ప్రజలు పాజిటివ్ గానే ఆలోచిస్తున్నారు. ఇక తాజాగా భావితరాలు బాగుండాలని జగన్...తెలుగు భాషకు తగిన ప్రాధాన్యత ఇస్తూనే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే దీనిపై టీడీపీ, బీజేపీ, జనసేన...ఇతర పార్టీలు విమర్శలు చేస్తున్నాయి.


తెలుగు భాష ఇబ్బందిల్లో పడిపోతుందని కామెంట్లు చేస్తున్నారు.  అయితే ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసిన అస్సలు తగ్గకుండా కేబినెట్ లో కూడా ఆమోదించేశారు. దీంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ నిర్ణయం అమలు కానుంది. అయితే ఈ నిర్ణయం పట్ల  కూడా ప్రజలు పాజిటివ్ గానే ఉన్నారు. ఇక దీనిపై మంచి ఫలితం కూడా రావడం ఖాయం. అప్పుడు ప్రతిపక్షాలు కూడా సైలెంట్ అయిపోతాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: