టీడీపీ అధినేత చంద్రబాబుకు...ఎప్పుడు ఎవరోకరితో పొత్తు లేకపోతే ఉండలేరు అనుకుంటా. ఆయనకు పార్టీలో ఆధిపత్యం వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఎన్నికలో ఏదొక పార్టీతో పొత్తు పెట్టుకునే పోటీ చేశారు. అయితే 2019 ఎన్నికల్లో మాత్రం బాబు తొలిసారి సోలోగా బరిలోకి దిగారు. అందుకే ఈ ఎన్నికల్లో ఊహించని విధంగా టీడీపీ ఘోర ఓటమిని మూటగట్టుకుంది. చరిత్రలో లేని విధంగా 23 సీట్లకే పరిమితమైంది.


అయితే ఇక్కడ టీడీపీకి ఏదొక పార్టీతోనైనా పొత్తు ఉండుంటే కొంచెం ఎక్కువ సీట్లు అయిన గెలుచుకునేది. ఆ విషయం తెలుసుకున్న బాబు ఓటమి తర్వాత నుంచి పొత్తు లేకపోవడం వల్లే ఘోరంగా ఓడిపోయామని జ్ఞానోదయం మాటలు చెబుతున్నారు. ముఖ్యంగా బీజేపీ, జనసేనలతో పొత్తు ఉండాల్సింది అని బాగా బాధపడ్డారు. ఈ క్రమంలోనే బాబు ఆ రెండు పార్టీలకు మళ్ళీ దగ్గర చేరేందుకు వ్యూహాలు రచిస్తున్నారు.


అందులో భాగంగానే వైసీపీ ప్రభుత్వం మీద ఒంటరిగా పోరాటం చేయలేక ఇతర పార్టీల మద్ధతు కోరుతున్నారు. అతిపెద్ద పార్టీ గా ఉండి చిన్న చిన్న పార్టీల వెంట పడుతున్నారు. తాజాగా బాబు ఇసుక కొరతపై దీక్ష చేయడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే ఈ దీక్షకు మద్ధతు ఇవ్వాలని బీజేపీ, జనసేనలతో పాటు మిగతా పార్టీలని కోరుతున్నారు. అయితే అన్నీ పార్టీలు సుముఖంగానే ఉన్న దీక్ష వద్దకు ఎవరు వస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే బాబు పట్ల బీజేపీ ముందు నుంచి నెగిటివ్ గానే ఉంది.


బాబు బీజేపీతో కలవాలని ప్రయత్నాలు చేస్తున్నా...బీజేపీ నేతలు మాత్రం బాబుతో కలిసే ప్రసక్తి లేదని మొహం మీదే చెప్పేస్తున్నారు. కానీ జనసేన అలా లేదు. టీడీపీ పట్ల పాజిటివ్ గానే కనబడుతుంది. ఈ రెండు పార్టీలు దాదాపు ఒకే లైన్ లో పోతున్నాయి. స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుని పోటీ చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు. మొత్తానికైతే బాబు సోలోగా బండి నడపటం చాలా కష్టం.



మరింత సమాచారం తెలుసుకోండి: