జగన్ ..  సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడి కౌంటర్ ఇచ్చిన సంగతీ తెలిసిందే. అయితే ప్రతిపక్ష పార్టీలు ఇసుక విషయంలో జగన్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. టీడీపీ వేర్వేరుగా ఉద్యమాలు నిరసనల కు పిలుపు ఇచ్చినా.. జనసేన మాత్రం తన వ్యూహంలోకి ఇతర పార్టీలనులాగుతూ.. తన కార్యక్రమాలను సక్సెస్ చేసుకుంటోంది. అయితే వీరిద్దరి దూకుడుతో ఒకరకంగా అధికార వైసీపీలో అంతర్మథనం ప్రారం భమైంది. ఇసుక విషయంలో ఏమైనా తప్పు చేస్తున్నామా? అంటూ.. పైకి చెప్పకపోయినా.. లోలోన మాత్రం వైసీపీ నాయకులు తర్జన భర్జన పడుతున్నారు. సమీక్షలు చేసుకుంటున్నారు. ఇలా జరుగుతున్న క్రమంలోనే జగన్ వ్యూహాత్మకంగా ఈ సమస్య నుంచి బయటకు వచ్చేందుకు టీడీపీ జనసేనలకు చెక్ పెట్టేందుకు కీలక వ్యాఖ్యలు చేశారు.


పవన్ ను .. చంద్రబాబును వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం .. అవే.. వ్యక్తిగత విమర్శలు అంటూ.. పవన్ చంద్రబాబులు సైతం రెచ్చిపోయారు. పవన్ పెళ్లిళ్ల విషయా న్ని జగన్ అధికారికంగా నిర్వహించిన సభలోనే ఇటీవల మరోసారి విమర్శించారు. ఇక చంద్రబాబు మనవడి విషయాన్ని కూడా ప్రస్థావించారు. ఈ వ్యాఖ్యలు జగన్ ఉద్దేశ పూర్వకంగానే చేశారని అందరికీ తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యల జోలికి వెళ్లకుండా ఉంటే.. ఈ రెండు పార్టీల అధినేతలకు ఒక విధంగా తలనొప్పి.. వెళ్తే.. మరో తలనొప్పి.. విషయం అంతా పక్కదారి పడుతుంది.


 చంద్రబాబు .. పవన్ స్పందిస్తే ఇష్యూ పక్కదారి పడుతుందని జగన్ కు తెలుసు. దీంతో ఇరు పక్షాలు కూడా తీవ్రంగా ఆలోచించి జగన్ ట్రాప్లో పడకూడదని అనుకున్నాయి. అయితే రాత్రికిరాత్రి అనుకున్నా.. తెల్లారే సరికిమాత్రం ట్రాప్లో పడిపోయారు.ఈ క్రమంలోనే పవన్ జగన్పై విమర్శలు చేశారు. మీరు కూడా మూడు పెళ్లిళ్లు చేసుకోండి అంటూ వ్యాఖ్యానించారు.  ఇక చంద్రబాబు తన మనవడి గురించి కాకుండా తాను ఇసుక దీక్ష చేస్తున్నాననే ఇసుక ఇస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. కానీ వరదలు తుఫానులు వర్షాల గురించి తెలిసి కూడా చంద్రబాబు ఇలా వ్యాఖ్యానిస్తున్నారంటే.. ఆయన ఖచ్చితంగా జగన్ వలలో పడ్డారని అంటున్నారు పరిశీలకులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: