మనుగడ కోసం పోరాటం.. ఈ మాట వినగానే గుర్తుకు వచ్చేది చార్లెస్ డార్విన్. పరిమాణ సిద్ధం అనే ఓ గొప్ప గ్రంధాన్ని రాసిన శాస్త్రవేత్త అయన.  దానికోసం ఎన్నో ఏళ్ళు గాలపొగస్ దీవుల్లో ఉండి పరిశోధన చేశాడు.  ఒకరకంగా చెప్పాలి అంటే ఆయనది కూడా ఆ సమయంలో మనుగడ కోసం పోరాటమే.  పార్టీ జీవి తమ జీవితాన్ని కాపాడుకోవడానికి పోరాటం చేస్తుంది.  ఈరోజు తిండి దొరికితే చాలు అనుకునేవారు కొందరుంటే.. జీవితం హ్యాపీగా ఉండటం కోసం పోరాటం చేసేవారు కొందరు ఉంటారు.  


కొందరు పేరు కోసం, డబ్బుకోసం, హోదాకోసం.. ప్రజల్లో పలుకుబడికోసం.. ఎలా రకరకాలుగా పోరాటాలు చేస్తుంటారు.  ఇలా చేసే పోరాటాల్లో కొంతమంది విజయం సాధిస్తారు.  మరికొందరు పోరాటం చేస్తూనే అంతరించిపోతారు.  ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనుగడ కోసం పోరాటం జరుగుతున్నది.  రెండు పార్టీలు తమ మనుగడను, ఉనికిని చాటుకోవడనికి ప్రయత్నాలు చేస్తున్నాయి.  ఉనికి ఎలా ఉండాలి.  ఎలా ఉంటె మనం మనుగడ సాగించగలుగుతాం అని చూసుకొని పోరాటం చేయడానికి సిద్ధం అవుతున్నారు.  


అందులో ఒకరు పవన్ కళ్యాణ్.  అవును పవన్ కళ్యాణ్ తన ఉనికిని చాటుకోవడనికి శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాడు.  సినిమా రంగంలో విజయం సాధించిన పవన్, ఇప్పుడు రాజకీయంగా కూడా విజయం కోసం పోరాటం చేస్తున్నాడు.  రాజకీయంగా ఎలాగైనా నిలబడాలి అనుకుంటున్నాడు.  దానిలోభాగంగామే ఇసుక కోసం వైజాగ్ లో చేసిన లాంగ్ మార్చ్.. ఇప్పుడు రాజధానిలో ఉంటూ రోజుకు రెండుసార్లు ప్రెస్ మీట్లు పెడుతూ.. నేనుకూడా ఉన్నాను అని చెప్తున్నాడు.  


మరోవైపు 35 ఏళ్ళక్రితం ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని చంద్రబాబుగారు తన చేతుల్లోకి తీసుకొని నడిపిస్తున్నాడు.  2014 ముందు వరకు పార్టీ మంచిగానే ఉన్నది. అత్యాశకు పోయి బీజేపీతో వైరం పెట్టుకున్నాడు.  ఇంకేముంది కేంద్రంలో బీజేపీ సర్కార్ కూలిపోతుంది.  యూపీఏలో ఉండి చక్రం తిప్పొచ్చు అనుకున్న బాబుగారికి.. ఏపి ప్రజలు బాగా బుద్ది చెప్పారు.  175 స్థానాల్లో పోటీ చేస్తే కేవలం 23 మాత్రమే గెలుచుకున్నారు.  ఆ 23 మంది కూడా ఉంటారు అనే గ్యారెంటీ లేదు.  2019 సార్వత్రిక ఎన్నికల్లో దారుణంగా దెబ్బతిన్న టిడిపి తిరిగి తప్పు సాధించేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నది.  కానీ, టిడిపిపై అటు వైకాపా, ఇటు బీజేపీ మూకుమ్మడి దాడి చేస్తున్నాయి.  లేవకుండాకొడుతున్నాయి.  ఈ సమయంలో టిడిపి ఏ మేరకు పట్టు సాధిస్తుందో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: