రాజకీయాల్లో అవసరాలు బట్టి పార్టీలు మారిపోవడం సాధారణ విషయమే. కానీ ఆ అవసరాలు ఒకోసారి రాజకీయ భవిష్యత్ నే గందరగోళంలో పడేస్తాయి. ఇక ఈ గందరగోళం నుంచి బయటపడటానికి మళ్ళీ పార్టీ జంప్ చేస్తారు. సరిగ్గా ఇదే పరిస్థితిలో గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఉన్నారు. మామూలుగా అశోక్ వైసీపీలో ఉండుంటే మంచి భవిష్యత్ ఉండేది. కానీ అధికారం కోసం ఆశ పడి నిండా మునిగిపోయారు.


2014 ఎన్నికల్లో అశోక్ రెడ్డి వైసీపీ తరుపున గిద్దలూరు నుంచి పోటీ చేసి అప్పటి టీడీపీ అభ్యర్ధి అన్నా రాంబాబుపై 12 వేల మెజారిటీతో విజయం సాధించారు. ఇక అప్పుడు వైసీపీకి అధికారం దక్కలేదు. దీంతో టీడీపీలోకి జంప్ అయిపోయారు. అయితే అశోక్ టీడీపీలోకి రావడంతో అన్నా రాంబాబు వైసీపీలోకి వచ్చేశారు. ఇక 2019 ఎన్నికలకొచ్చేసరికి సీన్ రివర్స్ అయింది. అశోక్ టీడీపీ నుంచి పోటీ చేస్తే రాంబాబు వైసీపీ తరుపున బరిలో దిగారు.


ఇక పార్టీ మారిన అశోక్ కు గిద్దలూరు ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు. రాంబాబుని సుమారు 81 వేల మెజారిటీతో గెలిపించారు. రాష్ట్రంలో జగన్ తర్వాత హయ్యెస్ట్ మెజారిటీ ఇదే. ఈ భారీ ఓటమి దెబ్బకు అశోక్ కు జ్ఞానోదయం అయింది. టీడీపీలోకి వచ్చి తప్పు చేశానని తెలుసుకున్నారు. అందుకే ఓడిన దగ్గర నుంచి జగన్ చెంతకు చేరాలని అనేక ప్రయత్నాలు చేస్తూనే వస్తున్నారు.  


ఈ క్రమంలోనే అశోక్ చేరికకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. గతంలో అశోక్ తో ఉన్న మంచి పరిచయం కారణంగానే జగన్ పార్టీలోకి ఆహ్వానించినట్లు తెల్సింది. అయితే ఎమ్మెల్యే రాంబాబుకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అశోక్ ని పార్టీలోకి తీసుకురావాలని అనుకుంటున్నారు. దీంతో త్వరలోనే అశోక్ వైసీపీ తీర్ధం పుచ్చుకోవడం ఖాయమని తెలుస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: