క్షేత్రస్ధాయిలో  జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరికీ అదే అనుమానం వస్తోంది. ప్రత్యర్ధులపై బురదచల్లటానికి చంద్రబాబు ఎంతకైనా తెగిస్తాడనే విషయంలో ఎవరికీ అనుమానం లేదు. ఇపుడు కూడా అదే జరిగిందా ? అనే అనుమానం పెరిగోతోంది.

 

ఇసుక కొరతపై విజయవాడలో చంద్రబాబునాయుడు దీక్ష చేయబోతున్న సమయంలోనే  విశాఖపట్నంలో బ్లూ ఫ్రాగ్ టెక్నాలజీస్ అంశం బయటపడటం సంచలనంగా మారింది. బ్లూ ఫ్రాగ్ టెక్నాలజీస్  కంపెనీ అంటే అందరికీ తెలిసు కదా ? అదేనండి చంద్రబాబు, నారా లోకేష్ లకు బాగా సన్నిహితుల కంపెనీ.

 

ఈ కంపెనీ నుండే ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇసుక ఆన్ లైన్ విక్రయాల వెబ్ సైట్ హ్యాక్ అవుతున్నట్లు అనుమానిస్తున్నారు. ఎప్పుడు వెబ్ సైట్ ఓపెన్ చేసినా నో స్టాక్ అనే వస్తోందనే ఫిర్యాదులు కొద్ది రోజుల క్రితం బాగా వినిపించింది.  దాంతో ప్రభుత్వంలోని సైబర్ నిపుణులు రంగంలోకి దిగినట్లు సమాచారం. వెబ్ సైట్లలో కనిపిస్తున్న నోస్టాక్ అని తరచూ ఎలా కనిపిస్తోందనే  విషయంపై విచారణ జరిపారట.

 

తమ విచారణలో కొన్ని అనుమానాస్పద లావాదేవీలు కనిపించాయట. వాటి ఆధారంగా మరింతలోతుగా విచారణ జరిపితే కొన్ని ఐపి అడ్రస్ లు బయటపడ్డాయట. బయటపడిన ఐపి అడ్రస్ ల ఆధారంగా విచారణ జరిపితే అందులో చాలా వరకూ ఓ కార్యాలయానికి చెందిన అడ్రసే కనిపిస్తోందట. దాని ఆధారంగా సిఐడి అధికారులు అడ్రస్ పై దాడి చేస్తే అది బ్లూ ఫ్రాగ్ టెక్నాలజీస్ కార్యాలయం  అని తేలింది.

 

చంద్రబాబు హయాంలో ఇసుక సరఫరాను ఇదే కంపెనీ నిర్వహించింది. కాబట్టి సర్వర్ లోకి ఈ కంపెనీ సులభంగా చొచ్చుకుపోయిందని సిఐడి అనుమానిస్తోంది.

 

గతంలో కూడా ఓటర్ల జాబితాలో నుండి అర్హులైన పేర్లను తొలగించిన వివాదంలో కూడా  ఈ కంపెనీ పేరు అప్పట్లో మారుమోగిపోయింది. దాని ఓనర్ రవికిరణ్, చంద్రబాబు, లోకేష్ లకు బాగా సన్నిహితుడు కావటం గమనార్హం. తెలంగాణాలో కూడా ఉన్న అడ్రస్ ఆధారంగా  ఆయనపై తెలంగాణా పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టుకు ప్రయత్నిస్తే పరారయ్యాడు.

 

ఇంతకాలానికి అదే ఓనర్ పేరు ఇసుక అక్రమరవాణ వివాదంలో మళ్ళీ బయటపడింది. జరుగుతున్నది చూస్తుంటే ఇసుక కొరతకు చంద్రబాబే కారణమా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: