తెలంగాణ సీఎం కేసీఆర్ త‌ర్వాత స్థానం టీఆర్ఎస్‌లో ఎవ‌రిదో ఈ పాటికే తెలుగు రాజ‌కీయ విశ్లేష‌కులు, ఆస‌క్తుల‌కు ఇప్ప‌టికే ఓ క్లారిటీ వ‌చ్చేసింది. ఇప్ప‌టికే మంత్రిగా, పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ తెలంగాణ రాజ‌కీయాల్లో ఎలా దూసుకు పోతున్నాడో చూస్తూనే ఉన్నాం. ఇక ఎక్క‌డ ఏ ఎన్నిక జ‌రిగినా ? ఉప ఎన్నిక జ‌రిగినా కేటీఆర్ హ‌డావిడి ఓ రేంజులో ఉండేది. అలాంటిది కేటీఆర్ ఇప్పుడు ఎక్క‌డా క‌న‌ప‌డ‌డం లేద‌న్న చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.


ఓ వైపు తెలంగాణలో ఆర్టీసీ స‌మ్మె ఉధృతంగా న‌డుస్తోంది. ఇక ఇటీవ‌లే హుజూర్ న‌గ‌ర్ ఉప ఎన్నిక జ‌రిగిన‌ప్పుడు సైతం కేటీఆర్ వ‌చ్చి ఒక రోజు హ‌డావిడి చేసి వెళ్లిపోయారు. ఇక ఆర్టీసీ స‌మ్మె జ‌రుగుతుంటే దీనిని ఒంటి చేత్తో ప‌రిష్క‌రించాల్సిన కేటీఆర్ ఇప్పుడు చాలా సైలెంట్ అయిపోయారు. కేటీఆర్ ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా స్వేచ్ఛ‌గా ప‌ర్య‌టించ‌లేక‌పోతున్నారు. ఎక్క‌డికక్క‌డ మంత్రుల‌ను, ప్ర‌జా ప్ర‌తినిధుల‌ను నిల‌దీస్తున్నారు.


మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో అవ‌కాశం ద‌క్కించుకున్న కేటీఆర్‌కు అనుకోని అవ‌రోధాలు ఎదుర‌వుతున్నాయి. ప‌రిస్థితుల‌న్నీ ప్ర‌తికూలంగా మారుతున్నాయి. రాష్ట్రం అంతా ఎప్ప‌టిక‌ప్పుడు క‌లియ దిరిగే కేటీఆర్ ఇప్పుడు చివ‌రి సారిగా హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక ప్ర‌చారం కోసం బ‌య‌ట‌కు రావ‌డం మిన‌హా ఆ త‌ర్వాత ఎప్పుడూ క‌న‌ప‌డ‌లేదు. అటు సీఎం త‌న‌యుడిగా ఉండి, ఇటు పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉండి ఇలాంటి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తేనే ఆయ‌న‌కు ఫ్యూచ‌ర్‌లో మంచి మార్కులు ప‌డ‌తాయి.


అయితే ఈ ఛాన్స్‌ను ఆయ‌న ఎందుకు తీసుకోవ‌డం లేదో అర్థం కాని ప‌రిస్థితి. అయితే కేటీఆర్ మాత్రం ఎందుకు మౌనంగానే ఉంటున్నారు. ఈ ప‌రిస్థితుల్లో ఒక‌వేళ బ‌య‌ట‌కు వ‌స్తే.. ఊహించ‌ని విధంగా నిర‌స‌న‌ల‌తో ప‌రాభ‌వం ఎదురైతే.. మొత్తంగా ఇమేజ్ డ్యామేజ్ అవుతుంద‌న్న అయితే ఆయ‌న‌కు ఉంద‌న్న చ‌ర్చ‌లు గులాబీ వ‌ర్గాల్లో హాట్ హాట్‌గా వినిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: