తెలుగుదేశం పార్టీలో ఒక వింత రాజకీయాన్ని మనం స్పష్టంగా చూసుకోవచ్చు. రాజకీయంగా బలహీనంగా ఉన్నప్పుడు కార్యకర్తలను నమ్ముకుని రాజకీయంగా బలపడిన తర్వాత నమ్ముకున్న వారిని పక్కన పెట్టి రాజకీయం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా పార్టీని నమ్ముకుని బ్రతికిన వారికి అన్యాయం చేస్తూ పదవుల కోసం పార్టీలోకి వచ్చిన వారికి అధిక ప్రాధాన్యత ఇస్తూ జరిగే రాజకీయం చూసి ఎందరో కార్యకర్తలు కన్నీరు పెట్టుకుంటూ ఉంటారు. పార్టీ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఆ పార్టీలో కార్యకర్తలకు న్యాయం జరిగిన దాఖలాలు లేవు.


ఎన్ని ఉన్నా సరే ఆస్తులు అమ్ముకుని పార్టీ కి పెట్టిన నాయకులకు చంద్రబాబు విలువా ఇవ్వలేదు. కర్నూలు జిల్లాలో చంద్రబాబు అలాంటి రాజకీయమే చేసి నేడు పార్టీని నాశనం చేశారు. ప్రజారాజ్యం, కాంగ్రెస్, వైసీపీ ఇలా మూడు పార్టీలు మారి వచ్చిన భూమా కుటుంబానికి చంద్రబాబు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు అనేది వాస్తవం. జిల్లాలో ఎందరు సీనియర్ నాయకులు ఉన్నా సరే వారిని కాదని చంద్రబాబు... భూమా అఖిల ప్రియను మంత్రిని చేశారు.


అప్పటి వరకు కోట్లు పోగొట్టుకున్న వారు పక్కకి పోయారు. ఇప్పుడు ఆమెపై కేసులు నమోదు చేస్తున్నారు...అధికారంలో ఉన్నప్పుడు అడ్డం పెట్టుకుని ఆడిన డ్రామాలకు ఇప్పుడు ప్రభుత్వం సమాధానం చెప్తుంది. ఇక ఆమె దెబ్బకు ఎంతో మంది యువ నాయకులు వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. స్థానికంగా పని చేసే వందలాది మంది కార్యకర్తలు పార్టీకి ఓటు వేయకుండా వైసీపీకి ఎన్నికల్లో పని చేశారు.


అఖిల ప్రియ ఇప్పుడు మాజీ మంత్రి... చివరికి ఇప్పుడు తన డ్రామాలను కొనసాగిస్తూ రాజకీయంగా బలహీనంగా ఉన్న సమయంలో కూడా నమ్ముకున్న వారిని పక్కన పెడుతూ జిల్లాలోనే పార్టీని ముంచే కార్యక్రమం చేస్తోందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు జిల్లాలో ఆమెపై తీవ్ర వ్యతిరేకత ఉంది... చాలా మంది స్థానిక నాయకులు ఆమెకు వ్యతిరేకంగా పని చేస్తున్నారు. ఏదేమైనా అఖిల్‌కు జిల్లా పార్టీలో పొగ‌ల సెగ ఎక్కువ‌గానే ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: