ఇప్పటి కాలంలో స్కూల్‌కు వెళ్లే పిల్లల పరిస్దితి ఎలా ఉందంటే వారి బ్రతుకులు కూలీల లాగా మారాయి. ఎందుకంటే బండెడు పుస్తకాలు భుజాన వేసుకుని, చదువులతో కుస్తీ పడుతూ సరిగ్గా తిని తినక వారి మెదళ్లనూ మొదలంటూ తొలుచుకుంటూ రేపటి భవిష్యత్తు కోసం ఇప్పటి నుండే బాల్యాన్ని త్యాగం చేస్తున్నారు. ఈ చదువులు ఎలా ఉన్నాయంటే వీరికి తినడానికి సమయం కూడ చాలడం లేదు.


హోం వర్క్స్, అని క్లాస్ వర్క్ అని రోజంతా రాసిన అయిపోనంతగా ఇస్తున్నారు. ఈ చదువులు వారి భవిష్యత్తుకు బాటలు వేయడం అంటుంచితే బాధపెడుతున్నాయని చెప్పవచ్చూ. ఇకపోతే స్కూళ్లలో విద్యార్ధులకు సాధారణంగా లంచ్ అవర్, బ్రేక్ అవర్, స్పోర్ట్స్ అవర్ అంటూ అనడం  కామన్. కానీ కేరళ రాష్ట్రంలో మాత్రం విద్యార్ధుల కోసం వాటర్ బెల్స్ పద్దతిని పాటిస్తున్నారు. ఇలా ఎందుకంటే చదువుకునే పిల్లలు స్కూల్‌కు వచ్చాక అసలు నీటిని ఎక్కువగా తాగలేక పోతున్నారట.


ప్రతి రోజు పిల్లలు, టీనేజర్స్ మూడు లీటర్ల నీళ్లు త్రాగాలి. కానీ స్కూళ్లలో మంచినీటి సౌకర్యాలు, సరైన మరుగుదొడ్లు లేకపోవడం వల్ల మంచినీటిని తాగేందుకు ఇష్టపడడం లేదు. దీంతో పిల్లల్లో తలనొప్పి, చిరాకుతో పాటు ఫిజికల్ వీక్‌నెస్ వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి సమస్యను అధిగమించడానికి ఈ వాటర్ బెల్ సిస్టాన్ని అమలు చేస్తున్నారట. దీనివల్ల విద్యార్ధుల ఆరోగ్యం పాడవకుండా ఉండటమే కాకుండా, సరైన సౌకర్యాలు లేవని చదువుకు దూరంగా ఉండే వారి సంఖ్య తగ్గిపోతుందని భావిస్తున్నారు. 


ఇకపోతే ఈ విధానంపై తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్ధుల తల్లిదండ్రులు కేరళ ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపించడమే కాకుండా, ఈ వాటర్ బెల్స్ విధానాన్ని అన్ని రాష్ట్రాల్లో అందుబాటులోకి తెస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిజమే కదండీ చదువుకునే పిల్లలకు మనం ఎన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆలోచించేకంటే వారికి చదువుకోవడానికి ఏం ఉంటే బాగుంటుందో అదే చేస్తే వారు ఆనందంగా ఉంటారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: