మాములుగా అధికారం ప్రభుత్వం చేతిలో ఉంటుంది. ప్రభుత్వం చెప్పినట్టుగా సైన్యం వినాలి.  అప్పుడే దేశం కంట్రోల్ లో ఉంటుంది.  సైన్యం చేతిలో దేశం ఉందంటే దాని భద్రత, మనుగడకు ముప్పు ఉంటుంది.  ఎందుకంటే, సైన్యానికి దూకుడు ఎక్కువగా ఉంటుంది.  ఆ దూకుడుకు కళ్లెం వేయకుంటే దేశం పరిస్థితి దారుణంగా మారిపోతుంది.  అందుకే సైన్యం దూకుడును కంట్రోల్ చేస్తుంటారు.  


ఇదిలా ఉంటె పాక్ లో పరిస్థితులు ఎప్పుడు ప్రభుత్వం కంటే సైన్యం చేతిలోనే ఉంటాయి.  అధికారం ప్రజల చేతిలో ఉన్నా, సైన్యం కంట్రోల్లోనే అంతా నడుస్తుంది.  సైన్యం చెప్పినట్టుగానే అక్కడ వినాలి.  ప్రభుత్వం స్వతహాగా ఏ నిర్ణయం తీసుకోలేదు. అందుకే ప్రజలు అక్కడ ఇబ్బందులు పడుతున్నారు.  ఇక కర్తార్ పూర్ విషయంలో కూడా ఇలానే 1947 లో ఇండియా పాకిస్తాన్ దేశాలు విడిపోయినప్పుడు గురుదాస్ పూర్ నుంచి గురుద్వారా వరకు కర్తార్ పూర్ కారిడార్ కట్టాలని అనుకున్నారు.  


కానీ, కర్తార్ పూర్ కారిడార్ ను నిర్మాణం నిన్నా మొన్నటి వరకు పూర్తి కాలేదు.  ఎన్నో చర్చలు, ఒత్తిళ్లు తరువాత ఇటీవలే పూర్తి చేసుకున్నది.  నవంబర్ 9 వ తేదీన దీన్ని ఓపెన్ చేశారు.  అయితే, కర్తార్ పూర్ కారిడార్ ఓపెనింగ్ సమయంలో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మొదట కర్తార్ పూర్ కారిడార్ దాటి పాక్ లో ఉన్న గురుద్వారా వెళ్ళడానికి పాస్ పోర్ట్, 20 డాలర్ల ఫీజు చెల్లించాలని షరతు పెట్టింది.  తరువాత ఫీజు, పాస్ పోర్ట్ అవసరం లేదు. భారత్ ఇచ్చే ఎలాంటి ధ్రువీకరణ పత్రం ఉన్నా చాలు అన్నది.  


20 డాలర్ల ఫీజు చెల్లించాలి అంటే మాములు విషయం కాదు.  దాదాపుగా 1500 రూపాయలు.  సరే అది కడతారు.  వదిలేయండి.  కానీ, అందరికి పాస్ పోర్ట్ ఉండకపోవచ్చు.  పాస్ పోర్ట్ ఉంటేనే పంపిస్తాం అంటే  ఎలా చెప్పండి.  మొదట అవసరం లేదు అని చెప్పిన పాక్ ప్రభుత్వం ఆ తరువాత దీనిపై కావాలి.. వద్దు అనే అనేక మాటలు చెప్పింది.  చివరకు సైన్యం పూనుకొని, పాస్ పోర్ట్ ఉండాల్సిందే అని, పాస్ పోర్ట్ లేకుంటే పంపేది లేదని చెప్పింది. ఇన్ని షరతులు పెట్టడంతో కేవలం ఈ కారిడార్ ద్వారా 900 మంది లోపే వెళ్లి దర్శనం చేసుకున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: