టిక్‌టాక్‌...సోష‌ల్ మీడియాలో ఓ సంచ‌ల‌నం. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పేరే మార్మోగుతోంది. సరదాగా మొదలవుతున్న టిక్‌టాక్‌‌ రానురాను వ్యసనంగా మారుతోంది. అనేక అనర్థాలకు కారణమవుతోంది. అనేక కుటుంబాల‌ను రోడ్డున ప‌డేస్తోంది. కొంద‌రిని అమాంతం సెల‌బ్రిటీల‌ను చేస్తోంది. అయిన‌ప్ప‌టికీ...అనేక మంది టిక్ టాక్ వాడుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే...ప్రముఖ సోషల్ యాప్ ఇన్‌స్టాగ్రామ్ త్వరలో రీల్స్ పేరిట ఓ నూతన ఫీచర్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తేనుంది. 


ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లోని ఎక్స్‌ప్లోర్ సెక్షన్‌లో అందిస్తున్నారు. ఈ ఫీచర్ వల్ల టిక్‌టాక్ తరహాలో యూజర్లు వీడియోలను క్రియేట్ చేసి తమ తమ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లలోకి వాటిని అప్‌లోడ్ చేయవచ్చు. ఈ క్రమంలో వాటిని యూజర్లకు చెందిన ఇన్‌స్టాగ్రామ్ ఫ్రెండ్స్ లేదా పబ్లిక్ వీక్షించేందుకు వీలు కలుగుతుంది. ఇక వీడియోల నిడివిని 15 సెకండ్లుగా నిర్ణయించారు. యూజర్లకు తమకు నచ్చిన మ్యూజిక్ లేదా పాటలను సదరు వీడియోలకు యాడ్ చేసుకుని, పలు రకాల ఫిల్టర్లను అప్లై చేసేందుకు గాను రీల్స్ ఫీచర్‌లో ఎడిటింగ్ టూల్స్‌ను కూడా అందివ్వనున్నారు.  త్వరలోనే ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫాంలపై ఇన్‌స్టాగ్రామ్‌ను వాడుతున్న యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.


భారతదేశంలో సోషల్ మీడియా మార్కెట్‌ను కంట్రోల్ చేసేందుకు ఫేస్ బుక్ గూగుల్,టిక్ టాక్, షేర్ చాట్‌లు పోటీ పడుతున్నాయి. సాధార‌ణ వినియోగ‌దారులే కాకుండా రాజ‌కీయ నాయ‌కుల నుంచి కంటెంట్ విషయంలో వ్యతిరేకత వచ్చినా టిక్ టాక్ యూజర్ బేస్ పెంచుకోగలిగింది. టిక్ టాక్ వచ్చి రెండేళ్లే అయింది. అయినా సరే 120 మిలియన్ యూజర్లతో కిటకిటలాడుతూ ఉంది. మ‌రి టిక్ టాక్ దూకుడును ఇన్‌స్టాగ్రాం ఏ విధంగా ఎదుర్కోగ‌లుగుతుంద‌నేది తేలాల్సి ఉంది. అదే స‌మ‌యంలో వినియోగ‌దారుల‌కు మ‌రింత ఫ‌న్ ద‌క్క‌డం ఖాయ‌మంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: