1947 లో ఇండియా.. పాక్ దేశాలు అధికారికంగా విడిపోయిన తరువాత, ఇండియాఅంటే పాక్ ఒంటికాలుమీద లేవడం మొదలుపెటింది. 1948 లో అక్రమంగా కాశ్మీర్లోని కొంతభాగాన్ని ఆక్రమించుకుంది.  ఇప్పుడు పీవోకే పాక్ ఆధీనంలోనే ఉన్నది.  ఇండియా తలచుకుంటే గంటల వ్యవధిలోనే తిరిగి పీవోకే ను ఆక్రమించుకోగలదు.  కానీ, ఇండియా అలాచేయదలచుకోలేదు.  ఇండియా ఏం చేయాలనీ అనుకుంటుందో అదే చేస్తుంది.  ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలులోకి వచ్చిన తరువాత మొత్తం మారిపోయింది.  


మోడీ దేశంలోని అన్ని సమస్యలను పరిష్కరిస్తూ వస్తున్నారు.  తాజాగా కాశ్మీర్ విషయంలో కూడా మోడీ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.  సంచలన నిర్ణయం ఏమిటంటే.. ఆర్టికల్ 370 రద్దు చేయడం.  ఈ ఏడాది ఆగష్టు 5 వ తేదీన రద్దు చేసిన తరువాత పాక్ మరింత రెచ్చిపోయింది.  ఇండియాపై విరుచుకుపడింది.  పైగా అంతర్జాతీయంగా ఇండియాను ఒంటరిని చేయడానికి పాక్ ప్రయత్నం చేసింది.  


పాక్ చేసిన ప్రయత్నాలు ఏవి కూడా ఫలించలేదు.  పైగా బెడిసి కొట్టాయి.  పాక్ తో ఏ విషయంపై కూడా ఇకపై చర్చలు ఉండవని, ఉంటె పీవోకే విషయంలో మాత్రమే ఉంటుందని, త్వరలోనే పీవోకే కూడా ఇండియాలో కలిపేసుకుంటామని భారత్ చెప్పడంతో పాక్ మెత్తబడింది.  భయపడింది.  దారిలోకి వచ్చినట్టుగానే కనిపించింది.  ఇందులో భాగంగానే తన అధీనంలో ఉన్న కులభూషణ్ విషయంలో కొద్దిగా తగ్గింది. ఆటను మాజీ భారతఅధికారి. అతడిని కావాలని కొన్ని కేసుల్లో ఇరికించి పాక్ ఉరిశిక్ష విధించింది.  కానీ, ఇండియా అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్లడం,, అక్కడి కోర్టు ఉరిశిక్షను రద్దు చేసింది.  కాగా, ఈ విషయంలో మిన్నటివరకు ససేమిరా అన్న పాక్, ఇప్పుడు మెట్టు దిగి ఉరిశిక్షను అమలు ఆపేసింది.  ఈ కేసును ఆర్మీ నుంచి సివిల్ కోర్టుకు షిఫ్ట్ చేసేందుకు తాజాగా సవరణలు చేస్తోంది.  సివిల్ కోర్టుకు వెళ్తే.. ఇండియా తరపున న్యాయవాదిని నియమించుకోవచ్చు.  


మరింత సమాచారం తెలుసుకోండి: