సుప్రీంకోర్టు ఈ రోజు మరో చారిత్రక తీర్పును వెలువరించింది. తాజా తీర్పుతో దేశంలో ప్రజలే "సుప్రీం" అన్న విషయాన్ని సుప్రీంకోర్టు తనను తాను ఆర్టీఐ యాక్ట్ పరిధి లోకి తెస్తూ ఇచ్చిన తీర్పుతో సుస్పష్టం చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) కార్యాలయం కూడా సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తుందన్న విషయాన్ని స్పష్టం చేసి పారదర్శకతకు పెద్ద పీట వేసింది. ప్రధాన న్యాయమూర్తి కార్యాలయానికి సంబంధించి ప్రజలకు ఉపయోగపడే సమాచారాన్ని ఒక దరకాస్తు ద్వారా అడిగి తెలుసు కునేందుకు ఈ తీర్పు వీలు కల్పిస్తుంది.  
Image result for Chief Justice of <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=INDIA' target='_blank' title='india-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>india</a> also brought under RTI Act: <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=SUPREME COURT' target='_blank' title='supreme court-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>supreme court</a> shocking Judgement
ఈ సంచలన తీర్పును సీజేఐ రంజన్ గొగోయ్ నేతృత్వంలో, జస్టిస్‌ ఎన్.వీ.రమణ, జస్టిస్‌ డీ.వై. చంద్రచూడ్, జస్టిస్‌ దీపక్ గుప్తా, జస్టిస్‌ సంజీవ్ ఖన్నాలతో కూడిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పును వెలువరించింది. సీజేఐ కార్యాలయం సమాచార హక్కుచట్టం పరిధిలోకి వస్తుందంటూ 2010లో ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించింది.


2010 జనవరిలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ తాజాగా సుప్రీం ధర్మాసనం తీర్పునిచ్చింది. పారదర్శకత అనేది న్యాయస్వేచ్ఛకు భంగం కాదని.. గోప్యత హక్కు.. సమాచార హక్కు అనేవి కలిసి మెలిసి ఉండాలని కోర్టు అభిప్రాయపడింది. న్యాయవ్యవస్థ పరిశీలనకు ఆర్టీఐ ఒక సాధనంగా ఉండాలని పేర్కొంది. ధర్మాసనం లోని మెజార్టీ న్యాయమూర్తులు ఢిల్లీ హైకోర్టు తీర్పును సమర్ధించటం గమనార్హం.
 

ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్, సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం ఏప్రిల్ 4 న తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. పారదర్శకత లేని వ్యవస్థను ఎవరూ కోరుకోరు. పారదర్శకత పేరుతో న్యాయవ్యవస్థ నాశనమవ్వకూడదు అని విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ అన్నారు.


2010లో ఈ అంశంపై విచారణ చేపట్టిన నాటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏపీ షా నేతృత్వంలొ, జస్టిస్‌ విక్రంజిత్ సేన్, జస్టిస్‌ ఎస్ మురళీధర్‌తో కూడిన ముగ్గురు సభ్యుల ఢిల్లీ హైకోర్ట్ ధర్మాసనం, సీజేఐ కార్యాలయం కూడా ఆర్టీఐ పరిధిలోకి వస్తుందని తన 88పేజీల తీర్పులో పేర్కొంది. ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ కార్యాలయాన్ని చేరిస్తే న్యాయ వ్యవస్థ స్వతంత్రత కు విఘాతం కలుగొచ్చన్న సుప్రీంకోర్టు పిటిషన్‌ ను కూడా ఈ సందర్భంగా ఢిల్లీ హికోర్ట్ ధర్మాసనం తోసిపుచ్చింది. 


న్యాయవ్యవస్థకు సంబంధించిన సమాచారాన్ని ఆర్టీఐ చట్టం కిందకు తీసుకురావడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కే జీ బాలకృష్ణన్‌ కు ఢిల్లీ  హైకోర్టు తీర్పు వృత్తి ప్రంగా వ్యక్తిగతంగా తీవ్ర విఘాతమైంది. 2007లో సుభాష్ చంద్ర అగర్వాల్ అనే ఆర్టీఐ కార్యకర్త సుప్రీంకోర్టులో ఒక దరకాస్తు వేశారు. దీనికి సారాంశం న్యాయ మూర్తుల ఆస్తుల సమాచారాన్ని కోరారు. దీంతో పాటు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి సుప్రీంకోర్టు కొలీజియంకు కేంద్రానికి మధ్య జరిగిన ఉత్తరప్రత్యుత్తరాల్ని తెలియజేయాలని కోరారు. అయితే సుభాష్ చంద్ర అగర్వాల్ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. 


దీంతో సుభాష్ చంద్ర అగర్వాల్ పట్టువిడవకుండా కేంద్ర సమాచార కమిషన్ ను ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సైతం ఆర్టీఐ పరిధిలోకి వస్తారని, కాబట్టి సమాచారాన్ని ఇవ్వాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానానికి చెప్పాలన్నారు. సుభాష్ చంద్ర అగర్వాల్ చేసిన వాదనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే, గుర్తు తెలియని వ్యక్తుల కారణంగా న్యాయవ్యవస్థకు స్వేచ్ఛ కల్పించాలన్న ఉద్దేశంతో సుప్రీంకోర్టు దీనిని తిరస్కరించింది. అయితే, ఇదే అంశంపై ఢిల్లీ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం 2009 సెప్టెంబరులో ఇలా తీర్పు ఇచ్చింది. దీనిపై అప్పీలుకు సుప్రీంకోర్టు వెళ్లింది. హైకోర్టు డివిజన్ బెంచ్ సైతం 2010లో సీజేఐ ఆఫీసు కూడా ఆర్టీఐ పరిధి లోకి వస్తుందని చెప్పింది.


ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ ఈ అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు ధర్మాసనం నేడు తీర్పును వెలువరిస్తూ "సీజేఐ కార్యాలయం ఆర్టీఐ పరిధిలోకి వస్తుంది" అని తన తీర్పు ద్వారా స్పష్టం చేసింది. 

CJI under RTI Act

మరింత సమాచారం తెలుసుకోండి: